చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయతార హీరోయిన్‌గా నటించింది. మరోవైపు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్..సైరా నరసింహారెడ్డి గురువైన గోసాయి వెంకన్న పాత్రలో నటించాడు. ఇంకోవైపు సుదీప్, విజయ్ సేతుపతి,జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించారు. మరోవైపు ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. హిందీలో అదే రోజున హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ల ‘వార్’ సినిమా విడుదల కానుంది. దీంతో ఈ సినిమాను అదే రోజున విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ను ఈ నెల 15న కర్నూలులో భారీ ఎత్తున చేయనున్నట్టు సమాచారం.
‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసింది కర్నూలులో కాబట్టి.. ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే బాగుంటుందని మెగాస్టార్ చిరంజీవితో పాటు చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్‌తో పాటు రజినీకాంత్, మోహన్ లాల్‌ను ముఖ్యఅతిథిలుగా హాజరు కానున్నట్టు సమాచారం.ఈ రకంగా ఈ సినిమాపై అన్ని భాషల్లో అంచనాలు పెరిగేలా చేస్తున్నారు. మొత్తానికి ‘సైరా’ సినిమాకు అన్ని భాషల్లో అంచనాలు పెరిగేలా చిత్ర యూనిట్ పెద్ద ప్లానే చేసినట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.