Sye raa: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘సైరా’ మేకింగ్ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్,నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి,రవికిషన్  ముఖ్యపాత్రల్లో నటించారు. ఆయా పాత్రలకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: September 23, 2019, 2:14 PM IST
Sye raa: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘సైరా’ మేకింగ్ వీడియో..
‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి (Twitter/Photo)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి భారీ ఎత్తున తెరకెక్కించాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి,రవికిషన్  ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా హీరోయిన్స్‌గా నటించారు. ఈ ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు రాజమౌళితో పాటు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించిన వివిధ పాత్రలకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు.



ఈ సినిమాలో బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువైన ‘గోసాయి వెంకన్న’ పాత్రలో నటించారు.

‘సైరా నరసింహారెడ్డి’లో భోజ్‌పురి సూపర్ స్టార్ రవికిషన్ శుక్లా ఈ సినిమాలో బసిరెడ్డి పాత్రలో నటించాడు.

‘సైరా నరసింహారెడ్డి’లో విలక్షన నటుడు జగపతి బాబు వీరారెడ్డి పాత్రలో నటించారు. తెరపై ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సాయం చేసే తమిళరాజు రాజపండి పాత్రలో నటించారు. నరసింహారెడ్డితో కలిసి ఆంగ్లేయులపై పోరాటం చేసే యోధుని పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కన్నడ స్టార్ నటుడు సుదీప్..అహంభావంతో కూడిన అవుకు రాజు పాత్రలో కనిపించనున్నాడు.

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సతీమణి సిద్దమ్మ పాత్రలో నటించింది.

‘సైరా నరసింహారెడ్డి’లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రముఖ నృత్య కళాకారిణి లక్ష్మి పాత్రలో కనిపించనున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఆరాధించే పాత్రలో కనిపించబోతున్నట్టు ఈ సినిమా ట్రైలర్‌లో చూపించారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 23, 2019, 2:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading