సైరా ఆడియో వేడుక తేదీ ఖరారు.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..

సైరా సినిమాపై ఇప్పుడున్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటూ వస్తున్న పీరియాడికల్ విజువల్ ఎంటర్‌టైనర్ సైరా నరసింహారెడ్డి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 10, 2019, 4:42 PM IST
సైరా ఆడియో వేడుక తేదీ ఖరారు.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..
సైరా పోస్టర్ (Source: Twitter)
  • Share this:
సైరా సినిమాపై ఇప్పుడున్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటూ వస్తున్న పీరియాడికల్ విజువల్ ఎంటర్‌టైనర్ సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో కూడా జోరు పెంచేస్తున్నారు టీం. ఇందులో భాగంగానే చిత్ర ఆడియో రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 18న ఈ చిత్ర ఆడియో విడుదల జరగనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy movie audio release date confirmed and Pawan Kalyan as Chief guest pk సైరా సినిమాపై ఇప్పుడున్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటూ వస్తున్న పీరియాడికల్ విజువల్ ఎంటర్‌టైనర్ సైరా నరసింహారెడ్డి. sye raa,sye raa twitter,sye raa instagram,sye raa movie audio release,sye raa audio event,sye raa movie release date,sye raa pawan kalyan,sye raa chiranjeevi,telugu cinema,sye raa audio sept 18,సైరా,సైరా చిరంజీవి,సైరా పవన్ కల్యాణ్,చిరంజీవి పవన్ కల్యాణ్,సైరా ఆడియో రిలీజ్ డేట్
తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)


దీనికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ కూడా బాబాయ్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపించినట్లు తెలుస్తుంది. కర్నూల్ ప్రాంతంలోనే ఈ చిత్ర ఆడియో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నా కూడా ప్రస్తుతం దీనిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. త్వరలోనే ఈ వేడుక ఎక్కడ జరగనుందో చెప్పనున్నారు.
Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy movie audio release date confirmed and Pawan Kalyan as Chief guest pk సైరా సినిమాపై ఇప్పుడున్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటూ వస్తున్న పీరియాడికల్ విజువల్ ఎంటర్‌టైనర్ సైరా నరసింహారెడ్డి. sye raa,sye raa twitter,sye raa instagram,sye raa movie audio release,sye raa audio event,sye raa movie release date,sye raa pawan kalyan,sye raa chiranjeevi,telugu cinema,sye raa audio sept 18,సైరా,సైరా చిరంజీవి,సైరా పవన్ కల్యాణ్,చిరంజీవి పవన్ కల్యాణ్,సైరా ఆడియో రిలీజ్ డేట్
సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరు అద్భుత నటన (Source: Youtube)

ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ఆడియో లాంఛ్ ఇలా ఉంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇంకా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని 250 కోట్లతో నిర్మిస్తున్నాడు. కచ్చితంగా ఈ చిత్రంతో చిరంజీవి మరోసారి సంచలనం సృష్టిస్తాడని.. తెలుగు సినిమా రికార్డులను చెరిపేస్తాడని నమ్ముతున్నారు అభిమానులు.
Published by: Praveen Kumar Vadla
First published: September 10, 2019, 4:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading