Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI SYE RAA NARASIMHA REDDY MOVIE 6 DAYS WORLDWIDE COLLECTIONS AND ITS CROSSED 100 CRORE SHARE PK

‘సైరా’ 6 డేస్ కలెక్షన్స్.. వరసగా రెండోసారి 100 కోట్ల క్లబ్‌లో చిరంజీవి..

సైరా పోస్టర్ Twitter

సైరా పోస్టర్ Twitter

సైరా నరసింహా రెడ్డి తెలుగులో సత్తా చూపిస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్ర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 6 రోజుల్లో 76.6 కోట్ల షేర్ అందుకుంది సైరా. దసరా సెలవులను బాగా క్యాష్ చేసుకుంటూ రచ్చ చేస్తున్నాడు చిరంజీవి.

సైరా నరసింహా రెడ్డి తెలుగులో సత్తా చూపిస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్ర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 6 రోజుల్లో 76.6 కోట్ల షేర్ అందుకుంది సైరా. దసరా సెలవులను బాగా క్యాష్ చేసుకుంటూ రచ్చ చేస్తున్నాడు చిరంజీవి. తొలిరోజు నుంచే తెలుగు రాష్ట్రాల్లో సైరా హవా కనిపిస్తుంది. నైజాంలో 21.70 కోట్ల షేర్ అందుకుంది.. ఆంధ్రాలో కూడా 54 కోట్ల మైలురాయి అందుకుంది సైరా. వీకెండ్‌తో పాటు దసరా సెలవలను సైరా బాగా క్యాష్ చేసుకుంటుంది. ఆరో రోజు 6 కోట్ల షేర్ వసూలు చేసి సైరా అనిపించాడు మెగాస్టార్.

సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మెగాస్టార్ ప్రభంజనం కనిపిస్తుంది. ఓవర్సీస్‌లో కూడా 2 మిలియన్ మార్క్ అందుకుంది ఈ చిత్రం. హిందీలో మాత్రం సైరా ఊహించిన వసూళ్లు తీసుకురావడం లేదు. ఈ చిత్రం అక్కడ 10 కోట్ల మార్క్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు 78 కోట్ల వసూలు చేసిన సైరా.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ 105 కోట్ల షేర్ వసూలు చేసింది.

సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


ఇక తమిళనాడులో కూడా ఆశించిన స్థాయిలో సైరా వసూళ్ళు రావడం లేదు. కానీ కన్నడలో మాత్రం దుమ్ము దులిపేస్తుంది ఈ చిత్రం. మొత్తానికి సైరా 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 107 కోట్ల షేర్ అందుకుంది.. గ్రాస్ దాదాపు 175 కోట్లకు పైగానే ఉంది. ఖైదీ నెం 150 తర్వాత వరసగా రెండోసారి కూడా 100 కోట్ల షేర్ అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడు మెగాస్టార్.

సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


170 కోట్లు దాటితే కానీ సైరా సేఫ్ అనిపించుకోదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే తెలుగులో మాత్రమే సైరా విజయం అందుకునేలా కనిపిస్తుంది. మిగిలిన చోట్ల మాత్రం చిరంజీవికి కాలం కలిసిరావడం లేదు. మరి ఈ దూకుడు ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Box Office Collections, Sye raa, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు