కన్నడ నాట చిరంజీవి ఘోర అవమానం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గతేడాది మెగాస్టార్ చిరంజీవి..రామ్ చరణ్ నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో మొదటి సారి ప్యాన్ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో ఒకేసారి విడుదలైంది. తెలుగులో కొన్ని ప్రాంతాల్లో తప్పించిన మిగిలిన భాషల్లో ‘సైరా నరసింహారెడ్డి’ కనీసం ప్రభావం చూపించలేకపోయింది. తాజాగా ఈ సినిమాను కన్నడ వెర్షన్ శాాటిలైట్ చానెల్‌లో ప్రసారం చేసారు. అక్కడ డిసెంబర్ 22న టెలికాస్ట్ ఈ సినిమాకు కేవలం 6.3 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అదే తమిళంలో మాత్రం రికార్డు స్థాయి టీఆర్పీ సొంతం చేసుకోవడం విశేషం. ముఖ్యంగా మెగా హీరోలకు తమిళనాటు కంటే కన్నడనాట మంచి ఫాలోయింగ్ వుంది. అక్కడి ప్రేక్షకులు కూడా కన్నడ వెర్షన్‌లో రిలీజైన సినిమా కంటే తెలుగు సినిమానే ఆదరించారు. అందుకే కన్నడ ప్రేక్షకులు.. అక్కడి మాతృభాషలో రిలీజైన ‘సైరా’ సినిమాను పట్టించుకోలేదు. అదే విధంగా టీవీలో టెలికాస్ట్ అయ్యేనాటికి అప్పటికే అమెజాన్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ‘సైరా నరసింహారెడ్డి’ సందడి చేసింది. అందుకే కన్నడలో ఈ సినిమాకు తక్కువ రేటింగ్ వచ్చిందని మెగాభిమానులు చెప్పుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood