‘సైరా నరసింహారెడ్డి’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఎలా ఉందంటే..

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.

news18-telugu
Updated: September 23, 2019, 5:11 PM IST
‘సైరా నరసింహారెడ్డి’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఎలా ఉందంటే..
సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ (Twitter/Photo)
news18-telugu
Updated: September 23, 2019, 5:11 PM IST
మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.చిరంజీవి తన 41 కెరీర్‌లో ఒక హిస్టారికల్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు చిరంజీవి నటించిన ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం,కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కావడం అనేది కూడా ఫస్ట్ టైమే అని చెప్పొచ్చు. నిన్ననే హైదరాబాద్‌లో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమాలో బ్రిటిష్ వాళ్లతో యుద్ద సన్నివేశాల్లో రక్తపాతం ఉండటంతో ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్టు సమాచారం.

megastar chiranjeevi sye raa narasimha reddy censor completed got ua certificate,syeraa narasimha reddy censor completed,censor board,sye raa narasimha reddy censor completed got ua certificate,Sye Raa Narasimha Reddy,sye raa narasimha reddy pre release event,sye raa narasimha reddy movie review,sye raa narasimha reddy,high court,telangana high court,uyyalawada narasimaha reddy, uyyalawada descendants file case over sye raa narasimha reddy,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy movie,Sye Raa Narasimha Reddy police case,Sye Raa Narasimha Reddy jubilee hills PS case,ram charan Sye Raa Narasimha Reddy,chiranjeevi Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy pre release event,Sye Raa Narasimha Reddy controversy,telugu cinema,ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి,సైరా నరసింహా రెడ్డి,సైరా వివాదాలు,పోలీస్ కేస్ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు,తెలుగు సినిమా,హైకోర్టు,హైకోర్టు మెట్లు ఎక్కిన ఉయ్యాలవాడ వారసులు,చిరంజీవి రామ్ చరణ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,సైరా నరసింహారెడ్డి సెన్సార్ కంప్లీట్,సైరా నరసింహారెడ్డి సెన్సార్ కంప్లీట్,యూ ఏ సర్టిఫికేట్ తో వస్తున్న సైరా నరసింహారెడ్డి,
‘సైరా నరసింహారెడ్డి’ యూ/ఏ సర్టిఫికేట్ జారీ


అంతేకాదు సెన్సార్ టాక్‌ను బట్టి... ఈ సినిమాలో ప్రేక్షకులను ఉద్విగ్నతకు గురిచేసే సన్నివేశాలు చాల ా ఉన్నాయట. సురేందర్ రెడ్డి ఆయా సన్నివేశాలను ఎంతో చక్కగా తెరపై చిత్రీకరించనట్టు సమాచారం.మరోవైపు కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించాడని టాక్. అంతేకాదు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్,నయనతార,విజయ సేతుపతి, జగపతి బాబు,తమన్నాతో ప్రతి పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉందని చెప్పారు. ఈ సినిమా 2 గంటల 40 నిమిషాలు అటు ఇటూగా ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున రిలీజ్ చేస్తున్నారు.

 

First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...