సైరా నరసింహా రెడ్డి విడుదలై నేటితో రెండు వారాలు పూర్తి చేసుకొని విజయవంతంగా 3వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం తెలుగులో సత్తా చూపిస్తుంది. ఇక్కడ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 14 రోజుల్లో 100 కోట్ల షేర్ అందుకుంది సైరా. ఇది కేవలం తెలుగు వర్షన్.. అందులో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. దసరా సెలవులను బాగా క్యాష్ చేసుకుంటూ రచ్చ చేసాడు చిరంజీవి. తొలిరోజు నుంచే తెలుగు రాష్ట్రాల్లో సైరా హవా కనిపిస్తుంది. నైజాంలో 33 కోట్ల షేర్ అందుకుని.. లాభాల్లోకి వచ్చేసింది ఈ చిత్రం. ఆంధ్రాలో కూడా 73 కోట్ల మైలురాయి అందుకుంది సైరా. ఈ వంద కోట్ల షేర్ వచ్చినా..చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. కేవలం నైజాం, ఉత్తరాంధ్రలో మాత్రమే లాభాల్లో వచ్చింది. మొత్తంగా టోటల్‌గా రూ.225 కోట్ల గ్రాస్.. రూ.135 కోట్ల షేర్ రాబట్టింది. వర్కింగ్ డేస్‌లో సోమ,మంగళ వారాల్లో రూ.90 లక్షలు, రూ.70 లక్షలతో మొత్తంగా రూ.1.60 కోట్లు కలెక్ట్ చేసింది.
తెలుగులో పాటు ఐదు భాషల్లో విడుదలై ‘సైరా నరసింహారెడ్డి’ .ఒక్క తెలుగులో మాత్రమే హిట్టైయింది. హిందీ సహా తమిళం మిగతా భాషల్లో సైరా సినిమాను పట్టించుకున్నవారే లేరు. ఈ సినిమాలో మిగతా భాషల నటీనటులు నటించినా..వాళ్లెవరు ఈ సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించలేదనే చెప్పాలి. ఇక ఓవర్సస్‌లో రూ.18 కోట్లకు గాను రూ.10 కోట్లనే వసూళు చేసింది.
రూ.170 కోట్లు దాటితే కానీ సైరా సేఫ్ అనిపించుకోదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే తెలుగులో కొన్ని చోట్ల మాత్రమే సైరా విజయం అందుకునేలా కనిపిస్తుంది. మిగిలిన చోట్ల మాత్రం చిరంజీవికి కాలం కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు రూ. 135 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో కూడా నైజాంతో పాటు ఉత్తరాంధ్ర, నెల్లూరులో మాత్రమే సేఫ్ అయింది ఈ చిత్రం. మిగిలిన చోట్ల బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. మొత్తానికి సైరాతో చిరు ప్రయాణం ఎక్కడ ఆగనుందో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Box Office Collections, Chiranjeevi, Ram Charan, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood, Tollywood Box Office Report