చిరంజీవి ‘సైరా’తో హృతిక్ రోషన్ ‘వార్’.. మెగాస్టార్ పోటీ తట్టుకుంటాడా..?

సైరా సినిమాతో తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సంచ‌ల‌నం సృష్టించాల‌ని చూస్తున్నాడు చిరంజీవి. ఆ న‌మ్మ‌కంతోనే ఇప్పుడు సైరా కోసం 250 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసాడు రామ్ చ‌ర‌ణ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 27, 2019, 3:12 PM IST
చిరంజీవి ‘సైరా’తో హృతిక్ రోషన్ ‘వార్’.. మెగాస్టార్ పోటీ తట్టుకుంటాడా..?
సైరా వార్ సినిమా పోస్టర్స్
  • Share this:
సైరా సినిమాతో తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సంచ‌ల‌నం సృష్టించాల‌ని చూస్తున్నాడు చిరంజీవి. ఆ న‌మ్మ‌కంతోనే ఇప్పుడు సైరా కోసం 250 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసాడు రామ్ చ‌ర‌ణ్. ఈయ‌న ఓ వైపు రాజ‌మౌళి సినిమాలో న‌టిస్తూనే మ‌రోవైపు త‌న తండ్రి సినిమా నిర్మాణ బాధ్య‌త‌లు కూడా చూసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం అక్టోబ‌ర్ 2న విడుదల కానుంది. ఒకేసారి ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఇప్పుడు చిరు సినిమాకు ఓ డేంజర్ కూడా ఉంది. అదే రోజు బాలీవుడ్‌లో మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదల కానుంది.
Megastar Chiranjeevi Sye Raa movie Box Office War with Hrithik Roshan and Tiger Shroff pk సైరా సినిమాతో తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సంచ‌ల‌నం సృష్టించాల‌ని చూస్తున్నాడు చిరంజీవి. ఆ న‌మ్మ‌కంతోనే ఇప్పుడు సైరా కోసం 250 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసాడు రామ్ చ‌ర‌ణ్. war movie,hrithik roshan war movie trailer,hrithik roshan war movie trailer released,hrithik roshan war,sye raa,sye raa twitter,sye raa facebook,sye raa instagram,sye raa release date,chiranjeevi sye raa,sye raa war movie,hrithik roshan war movie,hrithik roshan tiger shroff war movie,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy release date,sye raa teaser,sye raa,sye raa trailer,sye raa narasimha reddy trailer,sye raa release date,sye raa movie teaser,sye raa official teaser,sye raa narasimha reddy teaser launch,sye raa narasimha reddy songs,chiranjeevi sye raa teaser,sye raa vijay sethupathi first look,war teaser,hrithik roshan,tiger shroff,hrithik vs tiger teaser,war official teaser,war movie teaser,hrithik roshan teaser,hrithik tiger film teaser,tiger shroff teaser,war movie,hrithik new movie teaser,hrithik vs tiger trailer,war movie trailer,hrithik vs tiger new movie trailer,tiger new movie teaser,hrithik roshan vs tiger shroff,hrithik vs tiger,war teaser reaction,hindi movie teaser,చిరంజీవి,సైరా చిరంజీవి,వార్ హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్,వార్ సైరా నరసింహారెడ్డి,తెలుగు సినిమా
సైరా పోస్టర్ (Source: Twitter)


అక్టోబ‌ర్ 2న హృతిక్ రోష‌న్ వార్ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో టైగ‌ర్ ష్రాఫ్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బ్యాంగ్ బ్యాంగ్ ఫేమ్ సిద్ధార్ధ్ ఆనంద్ తెర‌కెక్కిస్తున్నాడు. వాణి క‌పూర్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తే.. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ మరింత ఆసక్తి పెంచేసింది. అసలు మనం చూస్తున్న‌ది ఇండియ‌న్ సినిమానేనా కాదా అని అనుమానాలు వ‌స్తున్నాయి ట్రైలర్ చూస్తుంటే. ఇలాంటి సినిమాను ఇప్పుడు సైరా మీద‌కు పోటీగా విడుద‌ల చేస్తున్నారు య‌శ్ రాజ్ ఫిల్మ్స్.

ఈ రెండు సినిమాలు ఒకేరోజు వ‌స్తే క‌చ్చితంగా న‌ష్ట‌పోయేది చిరంజీవే. ఎందుకంటే బాలీవుడ్‌లో హృతిక్ సినిమాల‌కు ఉండే మార్కెట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ మ‌ధ్య హృతిక్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా మెప్పించ‌క‌పోయినా కూడా ఆయ‌న సినిమాలు హిట్ టాక్ వ‌స్తే మాత్రం ర‌చ్చ చేస్తుంటాయి. మ‌రి చూడాలిక‌.. ఇప్పుడు చిరంజీవితో హృతిక్ చేయ‌బోయే వార్ ఎలా ఉండ‌బోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: August 27, 2019, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading