మెగాస్టార్ చిరంజీవి.. దాదాపు నూట యాబైకి పైగా సినిమాలలో నటించాడు. అందులో చాలా వరకు సూపర్ హిట్ సినిమాలే. అయితే ఆ సూపర్ హిట్ సినిమా టైటిల్స్‌ను వీలున్నప్పుడల్లా..మెగా హీరోలకంటే..బయటి హీరోలే వాడేస్తున్నారు. దీనికి కారణం.. చిరంజీవి సూపర్ హిట్ మూవీల టైటిల్స్‌ను ముట్టుకోవడానికి మెగా యంగ్ హీరోలు ఎవరు సాహసం చేయలేకపోవడం. అయితే బయటి హీరోలు మాత్రం.. చాల సులువుగా వాడేస్తున్నారు. దీంతో మెగా హీరోలు కూడా తమ సినిమాలకు చిరంజీవి సూపర్ హిట్ సినిమా టైటిల్స్‌ను పెట్టుకోవాలనీ భావిస్తున్నారట.. అందులో భాగంగా ఆ మధ్య సాయి తేజ్ సుప్రీమ్ పేరుతో ఓ సినిమా తీసి మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ మెగా హీరో ప్రయత్నించలేదు. అయితే చిరంజీవిని మెగా స్టార్ గా మార్చిన 'గ్యాంగ్ లీడర్' టైటిల్‌ను పెట్టుకోవాడానికి చరణ్ ఆ మధ్య ఇంట్రెస్ట్ చూపాడని..అయితే ఎమైందో అది..కార్యరూపం దాల్చలేదు. దీంతో యంగ్ హీరో నాని ఆ టైటిల్‌ను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు వాడుకుంటున్నాడు.
అయితే ఇలా చిరంజీవి సినిమా టైటిల్‌ను నాని వాడుకోవడం విషయంపై కొందరు..ట్రోల్స్ చేసిన, సెటైర్లు వేసిన..నాని వాటిని పెద్దగా పట్టించుకోకుండా..తన పనిలో తాను ఉన్నాడు. తాజగా మరో చిరంజీవి టైటిల్‌ను బెల్లంకొండ శ్రీనివాస్ కూడ వాడుకుంటున్నాడు. శ్రీనివాస్, అనుపమ నటించబోయే లేటెస్ట్ మూవీకి 'రాక్షసుడు' అనే టైటిల్‌ను ఖాయం చేసి..దాని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఇలా మంచి మంచి టైటిల్స్ అన్నీ బయటి హీరోలు వాడుకోవడం పట్ల.. మెగా యంగ్ హీరోలు కాస్తాంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
మత్తెక్కిస్తోన్న ఊర్వశి రౌటేలా మాక్జిమ్ ఫోటోషూట్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bellamkonda, Chiranjeevi, Nani, Telugu Cinema News