Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 21, 2019, 3:45 PM IST
చిరంజీవి కొరటాల దేవీ శ్రీ ప్రసాద్
ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు ఆస్థాన సంగీత దర్శకులు ఉంటారు. హీరోలు మారుతుంటారు కానీ వాళ్ల జోడీ మాత్రం మారదు. రాజమౌళికి కీరవాణిలా.. కొరటాల, సుకుమార్‌కు దేవీ శ్రీ ప్రసాద్ ఉంటాడు. వాళ్లెన్ని సినిమాలు చేసినా కూడా సంగీత దర్శకుడు మాత్రం మారడు. అయితే ఇన్ని రోజులకు కొరటాల శివ నుంచి దేవీ దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. ఆ వైపుగా చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్. ఈ కాంబినేషన్లో సినిమా కూడా ఓపెన్ అయింది.

కొరటాల శివ చిరంజీవి
ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా దేవీ శ్రీ ప్రసాద్ కదా అని ఇన్ని రోజులు అన్నారు కానీ ఇప్పుడు అలా కాదనిపిస్తుంది. చిరు 152వ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు పని చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ రాబోతున్నారని.. వాళ్లపై మెగాస్టార్ ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సైరాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది బాగానే మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్‌కు మంచి పేరొచ్చింది.

కొరటాల చిరంజీవి అజయ్ అతుల్
ఇక ఇప్పుడు కొరటాల కోసం కూడా బాలీవుడ్ నుంచి సంగీత దర్శకులను పట్టుకురావాలని చూస్తున్నాడు చిరు. కానీ కొరటాల శివ మాత్రం దేవీ శ్రీ ప్రసాద్ కావాలంటున్నాడు. చివరి వరకు కూడా చిరంజీవిని ఒప్పించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. పైగా చిరంజీవికి కూడా దేవీ అంటే ఇష్టమే. కానీ ఎందుకో మరి బాలీవుడ్ వైపు చిరు అడుగులు పడుతున్నాయి. మరి చివరికి దేవీ ఉంటాడా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
October 21, 2019, 3:45 PM IST