కొరటాల శివకు చిరంజీవి మెగా కండిషన్స్.. తల పట్టుకుంటున్న దర్శకుడు..

రీసెంట్‌గా ఈ సినిమా ఒక పాటతో షూటింగ్ ప్రారంభమైంది. చిరంజీవి, త్రిషలపై ఈ పాటను పిక్చరైజ్ చేసారు. ఈ చిత్రాన్ని కొరటాల శివ దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివకు చిరంజీవి కొన్ని కండిషన్స్ పెట్టాడట.

news18-telugu
Updated: January 26, 2020, 5:46 PM IST
కొరటాల శివకు చిరంజీవి మెగా కండిషన్స్.. తల పట్టుకుంటున్న దర్శకుడు..
కొరటాల శివ,చిరంజీవి (facebook/photo)
  • Share this:
‘సైరా నరసింహారెడ్డి’లో చారిత్రక యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఒదిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ఒక పాటతో షూటింగ్ ప్రారంభమైంది. చిరంజీవి, త్రిషలపై ఈ పాటను పిక్చరైజ్ చేసారు. ఈ చిత్రాన్ని కొరటాల శివ దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన  సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఓన్ ప్రొడక్షన్ హౌస్‌ కాబట్టి.. ఖర్చు విషయంలో దుబారా కాకుండా ఈ చిత్రాన్ని పకడ్బందీగా తెరకెక్కించమని చిరంజీవి దర్శకుడు కొరటాల శివకు ఆదేశాలు జారీ చేశారట.

director koratala siva big shock to mega star chiaranjeevi,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,vijayashanti,vijayashanti mahesh babu sarileru neekevvaru,vijayashanti movies,chiranjeevi vijayashanti,chiranjeevi vijayashanti hit pair,chiranjeevi vijayashanti again pair in koratala siva movie,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi,vijayashanti,vijayashanti movies,vijayashanti facebook,vijayashanti twitter,vijayashanti instagram,chiranjeevi hit movies,manchi donga songs,chiranjeevi movies parts,telugu movies,chiranjeevi birthday special,chiranjeevi full movies,chiranjeevi hit songs,chiranjeevi comedy scenes,vijayashanti movies parts,chiranjeevi and vijayashanti,chiranjeevi vijayashanthi movies,chiranjeevi vijayashanthi hit songs,chiranjeevi & vijayashanti love parts,telugu full movies,tollywood,telugu cinema,చిరంజీవి,విజయశాంతి,చిరంజీవి విజయశాంతి,మరోసారి జోడి కట్టబోతున్న చిరంజీవి,విజయశాంతి,కొరటాల శివ సినిమాలో విజయశాంతి చిరంజీవి,చిరంజీవికి జోడిగా విజయశాంతి,విజయశాంతి,విజయశాంతి సరిలేరు నీకెవ్వరు,డిఫరెంట్ కాన్పెప్ట్‌తో చిరంజీవి కొరటాల శివ
చిరంజీవి,కొరటాల శివ (Twitter/Photo)


ఈ సినిమాలో అనవసర సీన్స్ లేకుండా పేపర్ పై ఎడిటింగ్ చేసుకొని సెట్స్ పైకి వెళ్తున్నారట. అంతేకాదు ఈ సినిమా ఎలా చేసైనా 90 వర్కింగ్ డేస్‌లోనే కంప్లీట్ చేయాలని దర్శకుడికి టార్గెట్ పెట్టినట్టు సమాచారం. దాని ప్రకారమే కొరటాల శివ ప్లాన్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బడ్జెట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలనే అభిప్రాయానికొచ్చారట. సైరా విషయంలో కొన్ని అనవసరమైన సీన్స్‌తో ఎడిటింగ్‌లో తీసేల్సి వచ్చింది. ఆ సినిమా విషయంలో జరిగిన తప్పులు ఈ సినిమాకు జరగకూడదనే చిరంజీవి ముందుగానే కొరటాల శివకు సూచించారట. అందుకు తగ్గట్టే కొరటాల శివ ముందుకెళుతున్నాడు.  ఈ సినిమాకు ‘గోవిందాచార్య’ అనే పేరును పరిశీలిస్తున్నాడు. ఈ టైటిల్‌తో పాటు ‘గోవిందా హరి గోవిందా’ అనే పేరును కూడా అనుకుంటున్నారు. మొత్తానికి ఈ సినిమా విషయంలో చిరంజీవి వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 26, 2020, 5:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading