అవును సంక్రాంతి పండగ సందర్భంగా మెగా ఫ్యామిలీ హీరోలందరు ఒక చోట కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తమ అభిమానుల కోసం మెగా ట్రీట్ రెడీ చేసాడు. గతేడాది చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే సాధించింది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమాను డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ సినిమాను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జెమిని టీవీలో ప్రసారం కానుంది. ఒకవేళ థియేటర్స్‌లో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో చూడలేని ప్రేక్షకులు ఈ సినిమాను ఎంచక్కా టీవీలో చూడొచ్చన్నమాట. మొత్తానికి సంక్రాంతి పండగ రోజున టీవీలో తన లేటెస్ట్ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’తో చిరంజీవి మెగా ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.
Defending for peace is not war. #Syeraa | World Television Premier today at 6 PM @GeminiTV #GeminiSocial #GeminiMovies #SyeraaOnGemini #MegastarChiranjeevi #HappySankranthi pic.twitter.com/Vm2OWH10PL
— BARaju (@baraju_SuperHit) January 15, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood