హోమ్ /వార్తలు /సినిమా /

నట సింహానికి కొదమ సింహం ధన్యవాదాలు.. బాలయ్యను డియర్ బ్రదర్ అంటూ మెగాస్టార్ ట్వీట్..

నట సింహానికి కొదమ సింహం ధన్యవాదాలు.. బాలయ్యను డియర్ బ్రదర్ అంటూ మెగాస్టార్ ట్వీట్..

నందమూరి నట సింహం బాలకృష్ణకు కొణిదెల కొదమ సింహం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. 

    నందమూరి నట సింహం బాలకృష్ణకు కొణిదెల కొదమ సింహం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా అనే మహామ్మారిపై పోరాడుతున్నారు. ఈ వైరస్ కట్టడితో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తమ వంతు సాయం అందిస్తున్నారు సినీ నటులు. ఈ సందర్భంగా పలువురు నటులు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి తమ వంతు సాయం అందిస్తున్నారు. అందులో కొంత మంది సినీ నటులు లాక్‌డౌన్ కారణంగా సినీ కార్మికులకు పనిలేకుండా పోయింది. వారిని ఆదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. తాజాగా ఈ చారిటీకి నట సింహం నందమూరి బాలకృష్ణ రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ. 50 లక్షలు చెప్పున మొత్తంగా కోటీ రూపాయల విరాళాన్నిప్రకటించారు. టోటల్‌గా సినీ కార్మికులు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రూ. కోటి 25 లక్షల విరాళం ప్రకటించారు బాలయ్య.

    బాలకృష్ణ కరోనా పై పోరాటంలో భాగంగా చేసిన దాతృత్వానికి మెచ్చుకొని చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా బాలకృష్ణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడు బాలకృష్ణ రూ. 1 కోటి 25 లక్షల రూపాయల విరాళం అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు కష్టమొచ్చిన ప్రతి సమయంలో సినీ నటులు అంతా ఒక్కటిగా ముందుకు వస్తుంది. మీ అండదండలు సినీ పరిశ్రమకు ఉండాలని చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు.

    First published:

    Tags: Balakrishna, Balayya, Chiranjeevi, Coronavirus, Covid-19, NBK, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు