రామ్ చరణ్ కెరీర్ కోసం ఎప్పుడూ చిరంజీవి కూడా తాపత్రయపడుతూనే ఉంటాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నపుడు కూడా చరణ్ చేసే ప్రతీ సినిమా కథను ముందు చిరు విన్న తర్వాతే సెట్స్‌పైకి వచ్చేది. రామ్ చరణ్ కెరీర్ సక్సెస్ కావడంలో చిరంజీవి పాత్ర కూడా మరవలేనిది. అడుగడుగునా తనయుడి కెరీర్‌కు పూలబాటలు వేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు మెగాస్టార్. ఇప్పుడు కూడా తన సినిమా కథలతో పాటు తనయుడి సినిమాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడు ఈయన. చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్‌లోనే కొన్ని రోజులుగా పాల్గొంటున్నాడు మెగా పవర్ స్టార్.
ఈ చిత్రం తర్వాత ఈయనెలాంటి సినిమాలు చేయాలి.. రాజమౌళి లాంటి దర్శకుడితో సినిమా చేసిన తర్వాత విజయం అందుకోవడం అంటే చిన్న విషయం కాదు కాబట్టి చిరు ఇప్పట్నుంచే దీనికోసం వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఓ వైపు కొరటాల సినిమా కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్న చిరంజీవి.. చరణ్ సినిమాలపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. RRR తర్వాత కచ్చితంగా క్రేజ్ డబుల్ అవుతుంది.. అందుకే ఆ మార్కెట్ వృథా పోకుండా మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు చిరంజీవి.
RRR తర్వాత ఎలాంటి సినిమా చేస్తే రామ్ చరణ్ కెరీర్‌కు మంచిదో ఇప్పట్నుంచే ప్రణాళికలు రచిస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే అనిల్ రావిపూడితో పాటు సందీప్ రెడ్డి వంగా కూడా రామ్ చరణ్ కోసం కథలు సిద్ధం చేస్తున్నారని.. వాళ్లు చెప్పిన లైన్స్ కూడా మెగాస్టార్ విన్నాడని తెలుస్తుంది. వీళ్లే కాదు.. ఇద్దరు మళయాల దర్శకులు కూడా చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఏదేమైనా కూడా కచ్చితంగా రామ్ చరణ్ కెరీర్ పక్కాగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు చిరు. RRR సినిమా తర్వాత చరణ్ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Ram Charan, Telugu Cinema, Tollywood