Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI SPECIAL BIRTHDAY WISHES TO LEGENDARY DIRECTOR K VISWANATH HERE ARE THE DETAILS TA

Chiranjeevi - K Viswanath: కళా తపస్వి విశ్వనాథ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేసిన చిరంజీవి..

కళా తపస్వి కే.విశ్వనాథ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి (Twitter/Photo)

కళా తపస్వి కే.విశ్వనాథ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi - K Viswanath | కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి.. ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయనతో దిగిన ఓ పాత ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

    Chiranjeevi - K Viswanath:  కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా కే.విశ్వనాథ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి.. ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయనతో దిగిన ఓ పాత ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలో కళా తపస్వి విశ్వనాథ్.. చిరంజీవి ఓ నిత్య విద్యార్ధిలా ఒదిగిపోయాడు.  ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కే. విశ్వనాథ్ గారికి గురు తుల్యులు.. పితృసమానులు,మహోన్నత దర్శకులు,తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంచేసిన  కళా తపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన తీసిన ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యం. తెలుగు వారికి చిరస్మరణీయం. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసారు.

    ఇక కళా తపస్వి కే.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి మూడు సినిమాల్లో నటించారు. అందులో మొదటిది శుభలేఖ. వర కట్న సమస్యపై వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వీళ్ల కలయికలో ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ పతాకంపై ‘స్వయంకృషి’ సినిమా తెరకెక్కింది.


    చెప్పులు కుట్టే స్థాయి నుంచి చెప్పుల షోరూం యజమానిగా ఎదిగిన ఓ వ్యక్తి జీవితాన్ని ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారు. ఈ సినిమాలో సాంబయ్యగా చిరంజీవి నటనకు నంది అవార్డు వెతుక్కుంటూ వచ్చింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘ఆపద్భాందవుడు’  మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో నటనకు మరోసారి ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి .. వివి వినాయక్ దర్శకత్వంలో నటించిన ‘ఠాగూర్’లో వీళ్లిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రంలో కే.విశ్వనాథ్ సీఎం పాత్రలో నటించడం విశేషం. ఈ రకంగా కే.విశ్వనాథ్‌ దర్శకత్వంలో నటించడమే కాకుండా.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరంజీవి. మొత్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా తీర్చిదిద్దిన ఈయనకు కేంద్రం పద్మశ్రీ బిరుదుతో పాటు సినీ రంగంలో అత్యున్నత పురస్కారం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌవరించిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, K viswanath, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు