MEGASTAR CHIRANJEEVI SPECIAL BIRTHDAY WISHES TO KAIKALA SATYANARAYANA IN HIS HOME NR
Megastar Chiranjeevi - Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ ఇంటికి భార్యతో కలిసి వెళ్లిన మెగాస్టార్.. కారణం?
Megastar Chiranjeevi - Kaikala Satyanarayana
Megastar Chiranjeevi - Kaikala Satyanarayana: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈయన పరిచయం గురించి తెలియని వాళ్ళేవరు లేరు. తెలుగు ప్రేక్షకులందరినీ తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ స్టార్ హీరోగా నిలిచాడు.
Megastar Chiranjeevi - Kaikala Satyanarayana: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈయన పరిచయం గురించి తెలియని వాళ్ళేవరు లేరు. తెలుగు ప్రేక్షకులందరినీ తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ స్టార్ హీరోగా నిలిచాడు. గతంలో రాజకీయాలపై బాగా ఆసక్తి కూడా చూపాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీగా దూసుకెళ్తున్నాడు.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు. సమాజంలో జరిగే ప్రతి ఒక్క విషయం పై స్పందిస్తూ ఉంటాడు చిరంజీవి.
నిత్యం తన ఫోటోలను, తన కుటుంబ సభ్యుల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా బాగా షేర్ చేసుకుంటాడు. అంతేకాకుండా కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటాడు. వ్యక్తిగతంగా ఎంతో మందికి సహాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఏ శుభ సందర్భం వచ్చినా మర్చిపోకుండా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతాడు. ఇక సీనియర్ నటులను మర్చిపోకుండా వాళ్లు అందుకున్న అవార్డుల గుర్తింపులను, వాళ్ల జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతూ ఉంటాడు. వాళ్ల బాగోగులను పరామర్శిస్తుంటాడు.
తాజాగా మరో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ జన్మదిన సందర్భంగా.. తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవి కూడా తన సతీమణితో కలసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. 'తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, ఈరోజు నేను, నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశామని' తెలిపాడు.
తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను,నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి.Happy Birthday #KaikalaSatyanarayana garu! pic.twitter.com/NTm8RCf0LE
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2021
అంతేకాకుండా ఆయనతో కాసేపు ముచ్చటించడం తనకు ఓ మధురమైన అనుభూతి అని.. జన్మదిన శుభాకాంక్షలు సత్యనారాయణ గారు అని తెలిపాడు. పైగా ఆయనతో దిగిన ఫోటోను కూడా పంచుకున్నాడు చిరంజీవి. ఇక ప్రస్తుతం ఆషాడం సందర్భంగా తెలంగాణలో బోనాల పండగ ప్రారంభం అవడంతో తన సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు కూడా తెలిపాడు చిరంజీవి.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.