Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI SPECIAL BIRTHDAY WISHES TO ALLU ARJUN SB

Allu Arjun Birthday: అలా పార్టీ చేసుకో బన్నీ... స్పెషల్ విషెస్ చెప్పిన చిరు

అల్లు అర్జున్

అల్లు అర్జున్

చిరంజీవి నటించిన ‘విజేత’ చిత్రంలో బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు బన్నీ.గతేడాది ‘పుష్ప’తో ఐకాన్‌ స్టార్‌గా తనను తాను మలుచుకొని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు.

  ఇవాళ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. దీంతో రాత్రి నుంచే బన్నీ ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా బన్నీకి పలువురు సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ మామయ్య అయిన చిరుకు బన్నీకి స్పెషల్‌గా పుట్టినరోజు శుభాకంక్షలు తెలిపారు. "హ్యాపీ బర్త్‌డే బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వరించేలా చేస్తోంది. ఈ ల్యాండ్‌మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో" అని చిరు పేర్కొన్నారు.

  'పుష్ప' విజయంతో పాన్‌ఇండియా స్థాయిలో స్టార్‌ డమ్‌ను సొంతం చేసుకున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్​ను అందుకున్న బన్నీ మరికొన్ని కొత్త సినిమాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాడు. తాజాగా అతను 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు.. ఇతర సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అల్లు అర్జున్‌ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి తన భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సెర్బియాకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడే ఆయన వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.


  తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. కేరళ చలన చిత్ర పరిశ్రమలో తనదైన స్టైలిష్ నటనతో అభిమానులను సంపాదించుకొన్న దేశముదురు. తెలుగులో తన సిక్స్ ప్యాక్ తో యూత్ ని అలరించిన స్టైలిష్ స్టార్. గతేడాది ‘పుష్ప’తో ఐకాన్‌ స్టార్‌గా తనను తాను మలుచుకొని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చూపెడుతున్నారు అల్లు అర్జున్.

  అల్లు రామలింగయ్య మనవడిగా నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా అల్లు అర్జున్‌ తెరంగేట్రం బాగానే జరిగింది. అటు మెగా నట వారుసుడు హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అల్లు అర్జున్..1983 ఏప్రిల్ 8న మద్రాసులో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు రెండో కుమారుడు. చిన్నప్పుడే ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మామ చిరంజీవి నటించిన ‘విజేత’ చిత్రంలో బాలనటుడిగా మెరిసాడు. అటు స్వాతిముత్యంలో కూడా నటించాడు ఈ ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ అరంగేట్రం చేసిన మూవీ మెగాస్టార్ చిరంజీవి సినిమానే.. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు అల్లువారబ్బాయి. అనంతరం మెగాస్టార్ మూవీ ‘డాడీ’లోనూ ఓ రోల్ చేశాడు
  Published by:Sultana Shaik
  First published:

  Tags: Allu Arjun, Chiranjeevi, Pushpa Movie

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు