చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాభిమానులకు చిరు కానుక..

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ తన అభిమానులకు చిరు కానుక ఇవ్వనున్నారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 2, 2020, 12:19 PM IST
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాభిమానులకు చిరు కానుక..
చిరంజీవి Photo : Instagram
  • Share this:
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ తన అభిమానులకు చిరు కానుక ఇవ్వనున్నారు. వివరాల్లోకి వెళితే.. తెలుగు ఇండస్ట్రీలో పాత తరం హీరోల తర్వాత స్వయంకృషి, స్వీయ ప్రతిభతో అంచలంచెలుగా హీరోగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. ముఖ్యంగా చిరంజీవి బర్త్ ‌డే వస్తుందంటే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. కటౌట్‌లు పాలాభిషేకాలు వంటివి వెరీ కామన్. ఈ నెల 22న చిరంజీవి 65వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రామ్  చరణ్ యువశక్తి ఓ స్పెషల్ సాంగ్‌ను ఒక రోజు ముందు విడుదల చేయనుంది. మెగాస్టార్ మెగా ర్యాప్ పేరుతో రిలీజ ్ కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ , రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్ధాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు. నిన్న సాయంత్రం చిరంజీవి బర్త్ డే‌కు సంబంధించిన కామన్ డీపి వీడియోను విడుదల చేసారు.


ఇక చిరంజీవి విషయానికొస్తే.. 60 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా డాన్సులు గట్రా చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గతేడాది ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో పలకరించిన చిరంజీవి.. ఇపుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. అన్ని కుదిరితే ఈ యేడాదే  ఈ సినిమా విడుదలయ్యేది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా వచ్చే యేడాదికి పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి..మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్‌లో యాక్ట్ చేయనున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 2, 2020, 12:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading