‘కండోమ్ ఫ్యాక్టరీ’ పెట్టబోతున్న మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు..?

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మాత్రం ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే మెగా అల్లుడు కండోమ్ ఫ్యాక్టరీ చుట్టూ వెళ్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 15, 2019, 4:28 PM IST
‘కండోమ్ ఫ్యాక్టరీ’ పెట్టబోతున్న మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు..?
కళ్యాణ్ దేవ్ ఫైల్ ఫోటో
  • Share this:
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మాత్రం ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే మెగా అల్లుడు కండోమ్ ఫ్యాక్టరీ చుట్టూ వెళ్తున్నాడని ప్రచారం జరుగుతుంది. మెగా అల్లుడు అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతేడాది విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కళ్యాణ్ దేవ్. తొలి సినిమా నిరాశ పరచడంతో ఆ తర్వాత మళ్లీ సినిమా చేయలేదు ఈయన. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఆ మధ్య ఓ సినిమా మొదలు పెట్టినా కూడా అది అనుకోకుండా ఆగిపోయింది. కొంత భాగం షూటింగ్ అయిపోయిన తర్వాత బడ్జెట్ సమస్యతో సినిమాను ఆపేసారు. ఇక ఇప్పుడు ఈయన మరో కథకు కనెక్ట్ అయ్యాడు. అయితే ఇప్పుడు విన్న కథ మాత్రం చాలా క్రేజీగా ఉంటుందని తెలుస్తుంది.

Megastar Chiranjeevi son in law Kalyan Dev second movie titled as Condom Factory pk వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మాత్రం ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే మెగా అల్లుడు కండోమ్ ఫ్యాక్టరీ చుట్టూ వెళ్తున్నాడని ప్రచారం జరుగుతుంది. kalyan dev,kalyan dhev,kalyan dev chiranjeevi,kalyan dhev chiranjeevi,kalyan dev condom factory,kalyan dev movie condom factory,telugu cinema,condom factory movie,కళ్యాణ్ దేవ్,కళ్యాణ్ దేవ్ చిరంజీవి,చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్,కండోమ్ ఫ్యాక్టరీ కళ్యాణ్ దేవ్,తెలుగు సినిమా
చిరంజీవి, కళ్యాణ్ దేవ్


ఈ సినిమా కూడా పీరియాడికల్ కాన్సెప్ట్ అని తెలుస్తుంది. 1980ల్లో సాగే ఈ సినిమాకు కండోమ్ ఫ్యాక్టరీ అనే టైటిల్ ఫిక్స్ చేసారని ప్రచారం జరుగుతుంది. పులి వాసు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. 80ల కాలంలో కండోమ్ ఫ్యాక్టరీలో హీరో పని చేయడం వంటి లైన్ ఒకటి ఈయన కోసం అల్లారని.. ఈ కథ చాలా కొత్తగా అనిపించి కళ్యాణ్ ఓకే చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి సబ్జెక్ట్ మొత్తం పూర్తైపోయిన తర్వాత వెంటనే సినిమాను పట్టాలెక్కించే పనిలో కళ్యాణ్ ఉన్నాడని తెలుస్తుంది. మొత్తానికి ఒకవేళ టైటిల్ ఇదే అయితే మాత్రం కచ్చితంగా సంచలనాలు తప్పవు.

First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>