Anchor Pradeep Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బిహేవియర్‌తో యాంకర్ ప్రదీప్ షాక్..

చిరంజీవి ప్రదీప్ (Chiranjeevi Pradeep)

Anchor Pradeep Chiranjeevi: తెలుగు ఇండస్ట్రీలో మేల్ యాంకర్స్‌లో అందరికంటే ముందున్నాడు ప్రదీప్. ఈయనకు అదిరిపోయే క్రేజ్ ఉంది. స్పెషల్‌గా మనోడిపైనే ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అంత గుర్తింపు తెచ్చుకున్నాడు.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో మేల్ యాంకర్స్‌లో అందరికంటే ముందున్నాడు ప్రదీప్. ఈయనకు అదిరిపోయే క్రేజ్ ఉంది. స్పెషల్‌గా మనోడిపైనే ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇమేజ్ తెచ్చుకోడానికి ప్రదీప్‌కు దాదాపు పదేళ్లు పట్టింది. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా గుర్తింపు కోసం ముందడుగు వేస్తున్నాడు ప్రదీప్. అయితే ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన ఓ అరుదైన సంఘటన గురించి చెప్పుకున్నాడు ప్రదీప్. తనకు యాంకర్‌గా ఓ గుర్తింపు వచ్చాక తొలిసారి మెగాస్టార్‌ చిరంజీవిని కలవడానికి వెళ్లాడు ప్రదీప్. ఆ ఘటన గురించి గుర్తు చేసుకున్నాడు ఈయన. చిరు ఇంటికి వెళ్లినపుడు ఆయన పలకరించిన తీరుకు ఫిదా అయిపోయానంటున్నాడు ప్రదీప్. ముఖ్యంగా అంతకుముందు ఎప్పుడూ చిరును అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదని.. కానీ తొలిసారి అక్కడికి వెళ్లిన తర్వాత చిరంజీవి ఇచ్చిన మర్యాదకు తాను రుణపడిపోయానంటున్నాడు.
chiranjeevi,chiranjeevi twitter,anchor pradeep machiraju chiranjeevi,anchor pradeep machiraju chiranjeevi meeting,anchor pradeep machiraju chiranjeevi house,anchor pradeep machiraju shocked by chiranjeevi behavior,చిరంజీవి,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ చిరంజీవి షాక్
చిరంజీవి ప్రదీప్ (Chiranjeevi Pradeep)

నిజంగా అంత పెద్ద నటుడు తనను రిసీవ్ చేసుకున్న తీరుకు ఫిదా అయిపోయానంటున్నాడు ప్రదీప్. ఎంతో ప్రేమగా తనను పేరు పెట్టి పిలిచి.. మీ వాయిస్ చాలా బాగుంటుందండీ అంటూ చిరంజీవి చెప్పడంతో గాల్లో తేలిపోయానంటున్నాడు ప్రదీప్. అంతేకాదు మీరు పలికే తెలుగు పదాల ఉచ్చారణ నాకెంతో నచ్చుతుందని చిరంజీవి చెప్పినపుడు ఇంతకంటే ఏం కావాలి అనిపించిందని.. అంత పెద్ద మెగాస్టార్ తనను ప్రశంసించడం ఎప్పటికీ మరచిపోలేనని అన్నాడు ప్రదీప్.
chiranjeevi,chiranjeevi twitter,anchor pradeep machiraju chiranjeevi,anchor pradeep machiraju chiranjeevi meeting,anchor pradeep machiraju chiranjeevi house,anchor pradeep machiraju shocked by chiranjeevi behavior,చిరంజీవి,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ చిరంజీవి షాక్
యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep)

చిరంజీవి తనతో మాట్లాడుతుంటే అలాగే నిల్చుండిపోయానని.. ఆ సమయంలో కూర్చోండి అంటూ మెగాస్టార్ అంటున్నా కూడా ఆయన్ని చూస్తూ మైమరిచిపోయానని.. వేరే లోకంలోకి వెళ్లిపోయానంటున్నాడు యాంకర్. చిరు ఇంట్లో తనకు లభించిన మర్యాదను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఆనందం అలా వచ్చేస్తుందంటున్నాడు. ఆ తర్వాత చాలా సార్లు చిరంజీవిని కలిసాడు ప్రదీప్. ప్రతీసారి కూడా అలాంటి రిసెప్షన్ ఆయన నుంచి తనకు దొరుకుతుందని చెప్పుకొచ్చాడు ప్రదీప్. ఇదిలా ఉంటే కెరీర్ పరంగా కూడా ప్రదీప్ దూసుకుపోతున్నాడు.
chiranjeevi,chiranjeevi twitter,anchor pradeep machiraju chiranjeevi,anchor pradeep machiraju chiranjeevi meeting,anchor pradeep machiraju chiranjeevi house,anchor pradeep machiraju shocked by chiranjeevi behavior,చిరంజీవి,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ చిరంజీవి షాక్
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సాంగ్

ఈయన హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా త్వరలోనే విడుదల కానుంది. కరోనా కారణంగా ఇన్నాళ్లూ రాలేదు ఈ చిత్రం. ఇందులోంచి విడుదలైన ‘నీలి నీలి ఆకాశం’ పాట రికార్డులు తిరగరాసింది. మొత్తానికి చిరంజీవి ఇచ్చిన తీయని షాక్‌తో ప్రదీప్‌కు కొన్ని రోజులు నిద్ర కూడా పట్టలేదు మరి.
Published by:Praveen Kumar Vadla
First published: