అల్లు అర్జున్‌తో చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న చిరంజీవి..

Chiranjeevi Allu Arjun | శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాది పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. తాజాగా చిరంజీవి అల్లు అర్జున్‌ చిన్ననాటి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

news18-telugu
Updated: April 8, 2020, 11:42 AM IST
అల్లు అర్జున్‌తో చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న చిరంజీవి..
అల్లు అర్జున్ చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన చిరంజీవి (Twitter/Photo)
  • Share this:
శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాది పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులుగా తాను చెప్పాలకున్న విషయాలను ఇపుడు సోషల్ మీడియా వేదికగా అబిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు ప్రతిరోజు ఏదో ఒక విషయమై సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు. మొత్తంగా చిరంజీవి తనకు సంబంధించిన సినిమా విశేషాలతో పాటు కుటుంబ విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమాలనుతో పంచుకుంటున్నాడు. తాజాగా చిరంజీవి.. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అతనితో దిగిన చిన్ననాటి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. బన్నికి చిన్నప్పటి నుంచే డాన్స్‌లో గ్రేస్ ఉందని చెప్పుకొచ్చారు. అప్పుడే నేను అల్లు అర్జున్‌లో కసి, కృషి చూసాను. అది నాకు చాల ా ఇష్టమంటూ పేర్కొన్నాడు. మొత్తానినికి చిన్నప్పటి అల్లు అర్జున్‌తో ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.


ఇక అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రోజు బన్ని బర్త్ డే సందర్బంగా ఈ  సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. ఈ  చిత్రాన్నిప్యాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక అల్లు అర్జున్ చిరంజీవి హీరోగా నటించిన ‘విజేత’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఆ తర్వాత ‘డాడీ’ సినిమాలో చిన్నరోల్‌ చేసాడు. ఇక మెగాస్టార్ శంకర్ దాదా జిందాబాద్‌లో ఓ పాటలో గెస్ట్‌గా మెరిసిన సంగతి తెలిసిందే కదా.
<
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading