సౌత్ లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకుంది అనుష్క శెట్టి (Anushka Shetty). ప్రభాస్ (Prabhas) కు సిల్వర్ స్క్రీన్ జోడిగా గుర్తింపు పొందింది. వీరిద్దరి గురించి ఎన్నో రూమర్స్ వినిపించాయి. కానీ ఎప్పటికప్పుడు అనుష్క, ప్రభాస్ ఆ రూమర్స్ ని ఖండిస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా అనుష్క బాహుబలి తర్వాత అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రం రెండు మాత్రమే. అవి భాగమతి ఒకటి కాగా.. మరొకటి ఇటీవల విడుదలైన నిశ్శబ్దం. నిశ్శబ్దం తర్వాత అనుష్క మరే చిత్రానికి కమిట్ కాలేదు. ఇక అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనా అనే అనుమానాలు పెరుగుతున్న సమయంలో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే అనుష్క కంబ్యాక్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఓ క్రేజీ కాంబినేషన్ తో అని విన్పిస్తోంది. ఫ్యాన్స్ ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సరసన హీరోయిన్ గా అనుష్క నటించబోతున్నట్టు తెలుస్తోంది.
బాహుబలితో టాలీవుడ్ లో తన క్రేజ్ ను పదిలం చేసుకుంది అనుష్క. సైజ్ జీరో లాంటి సినిమాలతో ప్రయోగాలు చేసి శభాష్ అనిపించుకున్న జేజమ్మ.. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుందో. నవీన్ పొలిశెట్టితో సినిమా ఒకటి లైన్ లో ఉండగా.. ఇఫ్పుడు మరో క్రేజీ కాంబినేషన్ గురించి న్యూస్ హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో అనుష్క సినిమాను సెట్ చేసే పనిలో ఉన్నారు కొంత మంది మేకర్స్.
మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు లైన్ లో పెడుతూ.. దూసుకుపోతున్నారు. మెగాస్టార్ ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటించగా.. గాడ్ ఫాదర్ లో చిరు జోడిగా నయన తార మెరవబోతోంది. భోళా శంకర్ లో మెగా జోడీగా తమన్నా సందడి చేయబోతోంది. ఇక బాబీ డైరెక్షన్ లో తెరకెకుతోన్న సినిమాలో చిరంజీవి జంటగా శ్రుతి హాసన్ నటిస్తుంది. ఇలా మెగా మూవీస్ లో హీరోయిన్స్ ను కష్టపడి సెట్ చేశారు. ఇక రీసెంట్ గా వెంకీ కుడుముల తో కొత్త సినిమా ప్రకటించాడు మెగాస్టార్ .
ఇది కూడా చదవండి : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్కు ఇంటికి బాంబు బెదిరింపులు..నిందితుడి అరెస్ట్..
ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క శెట్టి అయితే బాగుంటుంది అనుకున్నారట. దీంతో, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్కను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారట మేకర్స్.ఈ పనిని డైరెక్టర్ వెంకీ కుడుముల బాధ్యతగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఒప్పించింది సినిమా చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఛలో సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుములా.. భీష్మ సినిమాతో తన ప్లేస్ ను పదిలం చేసుకున్నాడు. ఇఫ్పుడు ఏకంగా మెగా స్టార్ చిరంజీవితో మూవీ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.