ఆర్ఆర్ఆర్,కేజీఎఫ్,బీస్ట్ అన్ని వచ్చాయి వెళ్లాయి... ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఆచార్య(Acharya) సినిమానే. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు... సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీలో మెగాస్టార్‌తో(Megastar Chiranjeevi) పాటు ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా నటించడమే కారణం. తండ్రి కొడుకులు కలిసి నటిస్తోన్న సినిమా ఇది. దీంతో ఆచార్యపై అంచనాలు మామూలుగా లేవు. ఇక ఆచర్య సినిమాకు సంబంధించిన ప్రతీ వార్త కూడా సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ మధ్య ఆచార్య సినిమా విషయంలో ఛాలెంజ్ జరిగినట్లు కూడా సమాచారం.
అసలు విషయానికి వస్తే ఓ పాట విషయంలో తనయుడు రామ్‌చరణ్(Ram charan)కు చిరంజీవి(Chiranjeevi) సవాల్ విసిరారు. 'ఆచార్య'(Acharya) చిత్రంలో 'భలే భలే బంజరా' పాటలో డ్యాన్స్ స్టెప్లు ఎవరెలా వేస్తారో ఆ సెట్లో చూసుకుందామంటూ చిరు, చెర్రీకి ఛాలెంజ్ చేశారు. ఈ పాట షూట్‌కు వెళ్లే ముందు దర్శకుడు కొరటాలతో చిరంజీవి, రామ్‌చరణ్ చర్చించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 'భలే భలే బంజారా' పాటపై మంతనాలు సాగించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నాటునాటు పాటలో తారక్, చరణ్ ఇద్దరూ అదరగొట్టారని, ఆ అంచనాలను అందుకోవాలంటే కష్టపడక తప్పదని చిరంజీవి తెలిపారు. అయితే తనను చరణ్ డామినేట్ చేసే అవకాశం ఉందన్న చిరు...చెర్రీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
చిరు, చరణ్, కొరటాల శివ మధ్య జరిగిన సంభాషణను వీడియో ద్వారా తెలిపారు. ఇక వీడియోలో చిరు, చరణ్ డాన్స్ గురించి మాట్లాడుతూ.. రేయ్ చరణ్, ఏమనుకుంటున్నావ్.. నాతో పోటీ పెడతావా నేను నీ బాబుని రా.. నువ్వు రేపు సెట్స్ మీద తగ్గాలి అని చిరు అనడం అందుకు రామ్ చరణ్.. అప్పా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గను.. నీ నుంచి నేర్చుకున్నా కాబట్టి నీ పేరు చెడగొట్టను అని చెప్పడం.. సరే పద మాటలు ఎందుకు సెట్ లో చూసుకుందాం అని చిరు అనడం ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ మరింత వైరల్ అవుతోంది.
చరణ్.. సెట్లో కెమెరా ముందు చూసుకుందామంటూ సవాల్ చేశారు. అయితే రామ్ చరణ్ కూడా తండ్రి సవాల్ పై స్పందించారు. డామినేట్ చేయనని, కానీఎక్కడా తగ్గనని ప్రతిసవాల్ విసిరారు. దీంతో ఈ పాటపై ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. మరోవైపు చిరంజీవి,చరణ్ ఇద్దరూ కలిసి తొలిసారి పూర్తి స్థాయిలో చేసిన 'భలే భలే బంజారా' పాట ఈ నెల 18న విడుదల కానుంది. దీంతో ఈ పాట ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ పాటలో చిరు, చరణ్ ఇద్దరు పోటాపోటీగా డాన్స్ చేయనున్నారు.భలే భలే బంజారా అంటూ సాగే ఈ సాంగ్ ను తెలుగు టాప్ లిరిసిస్ట్స్ రామ జోగయ్య శాస్త్రి, భాస్కర్ బట్ల, అనంత్ శ్రీరామ్, కళ్యాణ్ చక్రవర్తి రాయడం విశేషం. ‘ఆచార్య' చిత్రానికి మణిశర్మ(Mani Sharma) సంగీతాన్ని అందిస్తున్నారు. ఈనెల 29న ఆచార్య సినిమా విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Megastar Chiranjeevi, Ram Charan