ఇక ఈ సినిమా సక్సెస్‌తో హీరోయిన్గా కృతిశెట్టికి కూడా మంచి ఫ్యూచర్ ఉందనే చర్చ జరుగుతోంది.
Chiranjeevi- Krithi Shetty: ఉప్పెన మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టిజ. ఈ సినిమా కోసం మొదట ఇంకో హీరోయిన్ని అనుకున్నప్పటికీ.. ఆ తరువాత కృతి ఫైనల్ అయ్యింది. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై.. టీజర్, పోస్టర్లు వచ్చినప్పటి నుంచి కృతి హాట్ టాపిక్‌గా మారింది. టీజర్లో ఈ బ్యూటీ ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్లు అందరినీ తెగ ఆకట్టుకున్నాయి.
Chiranjeevi- Krithi Shetty: ఉప్పెన మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టిజ. ఈ సినిమా కోసం మొదట ఇంకో హీరోయిన్ని అనుకున్నప్పటికీ.. ఆ తరువాత కృతి ఫైనల్ అయ్యింది. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై.. టీజర్, పోస్టర్లు వచ్చినప్పటి నుంచి కృతి హాట్ టాపిక్‌గా మారింది. టీజర్లో ఈ బ్యూటీ ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్లు అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూత్‌లో కృతికి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టాయి. ఆ తరువాత లిరికల్ వీడియోలు, ట్రైలర్‌తో మరింత ఫేమ్‌ని సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఉప్పెన రిలీజ్ అవ్వకముందే రెండు ఆఫర్లను దక్కించుకున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక.. కృతికి ఆదరణ పెరిగింది. సినిమా చూసిన అందరూ కృతి యాక్టింగ్‌ని మెచ్చుకుంటున్నారు. విజయ్ సేతుపతితో కలిసి నటించిన కొన్ని సన్నివేశాల్లోనూ సైతం కృతి ఆకట్టుకుందని అందరూ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కృతి గురించి మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి.. భవిష్యత్‌లో ఈమె డేట్లు దొరకడం కష్టమేమో. ఉప్పెన చూశాక కృతికి చాలా మంది అవకాశాలు ఇస్తారంటూ కాప్లిమెంట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి మరోసారి సర్ప్రైజ్ ఇచ్చారు చిరంజీవి.
ఉప్పెన సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ మూవీ యూనిట్లో పలువురికి చిరంజీవి గిఫ్ట్‌లను పంపారు. ఆ లిస్ట్‌లో కృతికి కూడా ఓ గిఫ్ట్‌ని పంపారు చిరు. అంతేకాదు ఆమెను అభినందిస్తూ ఓ లేఖను కూడా రాశారు. ఇక చిరు పంపిన గిఫ్ట్‌ని అభిమానులతో షేర్ చేసుకోనప్పటికీ.. ఆయన పంపిన లేఖను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కృతి.
ఆ లేఖలో చిరంజీవి.. ''పువ్వు పుట్టగానే పరిమళిలిస్తుందన్న దానికి నువ్వొక ఉదాహరణ. నువ్వు స్టార్ అవ్వడం కోసమే పుట్టావు. నువ్వు స్టార్‌వి మాత్రమే కాదు మంచి నటివి. భాష తెలియనప్పటికీ.. ఒక వారంలో నేర్చుకొని నీ పాత్రలో జీవించావు. నువ్వొక అద్భుతానివి. ఉప్పెన ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు నీకు అభినందనలు చెబుతున్నారు. ఈ బేబమ్మను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. నువ్వు ఇలాగే మంచి విజయాలను అందుకుంటూ కెరీర్‌ని కొనసాగిస్తావని భావిస్తున్నా'' అని చిరంజీవి తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇక దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న కృతి.. మీ గిఫ్ట్, మీ మాటలు నా హృదయాన్ని తాకాయి. మీ ఆశీస్సులు పొందినందుకు ఆనందంలో తేలిపోతున్నా అని కామెంట్ పెట్టారు.
@KChiruTweets sir thank you sooo much 🙏 this really really warmed my heart, the beautiful gift and your words of gold will remain in my heart forever ♥️ I’m feeling soo overwhelmed to have received your blessings 🙏🙏🙏 pic.twitter.com/Zu6ctsSNKA
కాగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 70కోట్లకు పైగా గ్రాస్‌ని రాబట్టింది ఈ చిత్రం. ఇక ఈ మూవీని తమిళ్లో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.