MEGASTAR CHIRANJEEVI SENSATIONAL COMMENTS ON MAA ELECTIONS RESULTS AND MANCHU VISHNU VICTORY PK
Chiranjeevi on MAA Elections: మంచు విష్ణు విజయంపై చిరంజీవి కామెంట్స్.. చిన్న చిన్న పదవుల కోసం ఇగోలు వద్దు..
చిరంజీవి (ఫైల్ ఫోటో)
Chiranjeevi on MAA Elections: గత రెండు మూడు నెలలుగా మీడియాలో హైలెట్ అవుతూ వస్తున్న మా ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. ఇందులో ఫలితాలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా ఈ ఫలితాలపై.. మా ఎన్నికలు జరిగిన తీరుపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు (Chiranjeevi on MAA Elections) చేసారు.
గత రెండు మూడు నెలలుగా మీడియాలో హైలెట్ అవుతూ వస్తున్న మా ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. ఇందులో ఫలితాలు కూడా బయటకు వచ్చాయి. చాలా రోజుల నుంచి అందరూ అనుకున్నట్టుగానే మంచు విష్ణు మా అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈయనకు 400కి పైగా సభ్యులు ఓటేసారు. ప్రకాష్ రాజ్‌పై దాదాపు 100 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు విష్ణు. కొండంత అండగా మోహన్ బాబు వెనక ఉండి నడిపించగా తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మంచు విష్ణుకు సపోర్ట్ నిలబడ్డారు. అందరి ఆశీర్వాదాలతో మంచు విష్ణు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలుపొందాడు. అయితే ఈ ఎన్నికలు ఎంత రసాభాసగా జరిగాయో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు కూడా చేసుకున్నారు. మళ్లీ కలిసి నటించాలనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఒకరినొకరు ఇలా దూషించుకోవడం ఏంటి అంటూ సినీ పెద్దలు సీరియస్ అయ్యారు.
ఇలాంటి వాతావరణం మళ్ళీ రాకూడదని.. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. ఎన్నికలన్న తర్వాత ఎవరో ఒకరు గెలవడం సహజమని.. అయితే చిన్నచిన్న పదవుల కోసం ఇలా ఇగోలకి వెళ్లడం.. బయటికి వెళ్లి మన పరువు మనమే తీసుకోవడం మంచిది కాదు అంటూ సూచించాడు మెగాస్టార్ చిరంజీవి. మనల్ని మనమే తిట్టుకుంటే బయట వాళ్ల ముందు చులకనగా అయిపోదామని.. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరాడు. ఉన్నది లేనిది మాట్లాడి మన పరువు మనమే పోగొట్టుకోవడం ఎందుకు.. కనీసం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అంటూ మెగాస్టార్ కోరాడు.
పదవులు అనేది శాశ్వతం కాదని.. కేవలం తాత్కాలికం మాత్రమే అంటూ కాస్త ఘాటుగానే చెప్పాడు చిరంజీవి. తాత్కాలికమైన పదవుల కోసం శాశ్వతమైన బంధాలను దూరం చేసుకోవడం మంచిది కాదు అంటున్నాడు మెగాస్టార్. ఎన్నికల్లో మాట్లాడేటప్పుడు కొట్లాటలు అవసరం లేదని.. చిన్న పదవుల కోసం వసుదైక కుటుంబం లాంటి మా విడిపోవడం మంచిది కాదు అంటున్నాడు మెగాస్టార్. అల్లర్లతో మా అసోసియేషన్ పరువు తీయొద్దని కోరాడు. మంచు విష్ణు గెలిచిన తర్వాత చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.