• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MEGASTAR CHIRANJEEVI SAYS THAT MEHER RAMESH TOLD HIM A STORY AND ITS INTERESTING PK

చిరంజీవి నోట మెహర్ రమేష్ మాట.. ఫ్యాన్స్‌లో వణుకు..

చిరంజీవి నోట మెహర్ రమేష్ మాట.. ఫ్యాన్స్‌లో వణుకు..

ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కెఎస్ రామారావు నిర్మించబోతున్నారని తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

Chiranjeevi Meher Ramesh: హెడ్డింగ్ చూసిన తర్వాత కచ్చితంగా చిరంజీవి అభిమానులకు కాస్తో కూస్తో కంగారు ఖాయం కదా. ఎందుకంటే పాపం మెహర్ రమేష్ జాతకం అలా ఉంది మరి.

  • Share this:
హెడ్డింగ్ చూసిన తర్వాత కచ్చితంగా చిరంజీవి అభిమానులకు కాస్తో కూస్తో కంగారు ఖాయం కదా. ఎందుకంటే పాపం మెహర్ రమేష్ జాతకం అలా ఉంది మరి. తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఈయన తెలుగులో మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అయిపోయాడు. ఈయన చేసిన నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించలేక.. నిర్మాతలను కూడా నిండా ముంచేసాయి. దాంతో మెహర్ పేరు ఎత్తినేనే నిర్మాతలతో పాటు హీరోలు కూడా పారిపోతున్నారు. ఈయన చేసిన కంత్రి, బిల్లా, శక్తి, షాడో అన్నీ ఫ్లాపులే.

చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)
చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)


దాంతో మెహర్ రమేష్‌ను నమ్మడం పూర్తిగా మానేసారు నిర్మాతలు. ముఖ్యంగా షాడో సినిమా వచ్చి ఏడేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన జోలికి ఎవరూ వెళ్లడం లేదు. మెగా కుటుంబానికి బంధువు కాబట్టి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు ఈయన. ఎలాగూ యాక్షన్ సీన్స్ బాగా చిత్రీకరిస్తాడని పేరుండటంతో పెద్ద సినిమాలకు అవి తెరకెక్కిస్తున్నాడు. దాంతో పాటు కొన్ని యాడ్స్ కూడా చేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో మెహర్ రమేష్ పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయాడు.

మెహర్ రమేష్ మహేష్ బాబు (Source: Twitter)
మెహర్ రమేష్ మహేష్ బాబు (Source: Twitter)


ఆ మధ్య నమ్రత నిర్మాణంలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తాడనే వార్తలు వచ్చినా కూడా అవి కూడా నిజం కాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నాడు మెహర్. ఆయనతోనే యాడ్స్ కూడా చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో చిరంజీవి బాంబ్ పేల్చాడు. తనకు కుర్ర దర్శకులతో పని చేయాలని ఉందని.. వాళ్ల ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ఉందని చెప్పాడు మెగాస్టార్. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ తాను కొందరు దర్శకులు చెప్పిన కథలను విన్నానని.. అందులో కొరటాల శివ సినిమా జరుగుతుంది.. నెక్ట్స్ సుజీత్, బాబీ సినిమాలున్నాయని చెప్పాడు చిరంజీవి.

చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)
చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)


ఆ వెంటనే మెహర్ రమేష్ పేరు కూడా వచ్చింది. ఈయన చెప్పిన కథ కూడా విన్న చిరు.. బాగుందని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఆయనతో మాత్రం సినిమా చేయొద్దని అభిమానులు చెబుతున్నారు. కథ ఎంత బాగున్నా కూడా మెహర్‌తో మాత్రం సినిమా చేసే ధైర్యం చేయొద్దని చిరును కోరుతున్నారు.. ఇంకా చెప్పాలంటే డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి మెహర్ పేరు చెప్పి ఫ్యాన్స్‌ను భయపెట్టాడు చిరంజీవి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు