చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయన ఆచార్య షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. కరోనా కానీ లేకపోయుంటే ఈ పాటికే సినిమా కూడా విడుదలకు దగ్గరగా వచ్చుండేది. దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ కూడా చేసాడు దర్శకుడు కొరటాల శివ. కానీ ఏం చేస్తాం.. అనుకోకుండా అన్నీ ఇలా జరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన చాలా విషయాలు బయటికి వస్తాయని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

చిరంజీవి కొరటాల శివ (chiranjeevi koratala)
ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ ఆచార్య అని చిరంజీవి నోరు జారాడు. దాంతో ఆ ఆసక్తి అందరిలోనూ పోయింది. ఇక పోస్టర్.. ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే చిరు పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేస్తామని అనౌన్స్ చేసాడు నిర్మాత రామ్ చరణ్. టీజర్ మాత్రం లేదు.. అలాంటి ప్లాన్స్ కూడా లేవు. కానీ నిజానికి కొరటాల శివ మాత్రం చిరంజీవి పుట్టిన రోజు కోసం ప్రత్యేకంగా ఓ టీజర్ కట్ చేసాడని తెలుస్తుంది.

కొరటాల శివ (koratala siva)
ఆగస్ట్ 22న అది విడుదల చేయాలని ఆయన ప్లాన్ కూడా చేసాడు. అయితే చిరంజీవి మాత్రం దానికి నో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అన్నీ ఇప్పుడే వద్దు.. పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్ కూడా వస్తుంది కదా.. అది చాలు అని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కావాలంటే తర్వాత ఎప్పుడైనా టీజర్ విడుదల చేద్దామని దర్శకుడికి చిరు సూచించినట్లు తెలుస్తుంది.

చిరంజీవి కొరటాల శివ (chiranjeevi koratala)
దాంతో కొరటాల ఆ ఆలోచన విరమించుకున్నాడు. లేకపోతే టీజర్ కూడా ఆగస్ట్ 22నే వచ్చుండేది.. ఆచార్య ఎలా ఉంటాడు అనేది మాత్రం 21 సాయంత్రమే విడుదల చేయనున్నాడు రామ్ చరణ్. ఏదేమైనా కూడా చిరు పుట్టిన రోజున వచ్చే అప్డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు.
Published by:Praveen Kumar Vadla
First published:August 21, 2020, 13:33 IST