Chiranjeevi: చిరంజీవి ఇంట్లో కరోనా.. ఆ నలుగురికి పాజిటివ్..

Chiranjeevi: వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ మాటలు చెప్పింది కూడా ఎవరో కాదు స్వయానా చిరంజీవి. ఈయన తాజాగా పోలీసులు నిర్వహించిన ప్లాస్మా డొనేషన్ కార్యక్రమంలో హాజరయ్యాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 7, 2020, 5:38 PM IST
Chiranjeevi: చిరంజీవి ఇంట్లో కరోనా.. ఆ నలుగురికి పాజిటివ్..
చిరంజీవి (Chiranjeevi/Twitter)
  • Share this:
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ మాటలు చెప్పింది కూడా ఎవరో కాదు స్వయానా చిరంజీవి. ఈయన తాజాగా పోలీసులు నిర్వహించిన ప్లాస్మా డొనేషన్ కార్యక్రమంలో హాజరయ్యాడు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్.. ప్లాస్మా డొనేషన్ గొప్పతనం గురించి చెప్పాడు. మందు లేని కరోనాకు ఇప్పుడు ప్లాస్మా డొనేషన్ అనేది సంజీవనిలా మారిందని చెప్పుకొచ్చాడు మెగాస్టార్. ఇదిలా ఉంటే తన ఇంట్లోనే పని చేసే వాళ్లలో నలుగురు కరోనా బారిన పడ్డట్లు సంచలన విషయాలు చెప్పాడు చిరంజీవి. (Credits: NTV/YouTube)


(వీడియో 13.23 నిమిషాల నుంచి) తమ వంట మనిషి శ్రీను.. స్విమ్మింగ్ పూల్ కడిగే లక్ష్మణ్.. అలాగే కూరగాయలు తరిమే ఆమె.. వంట మనిషి కొడుకుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పాడు చిరంజీవి. అయితే వాళ్లను వెంటనే క్వారంటైన్‌కు పంపించామని.. నెలన్నర రోజుల కిందే వాళ్లకు నయం అయిపోయిందని చెప్పాడు చిరు. వాళ్లకు రెండు సార్లు నెగిటివ్ వచ్చిన తర్వాత వచ్చి మళ్లీ తమ ఇంట్లోనే పని చేసుకుంటున్నట్లు చెప్పాడు చిరంజీవి. ఇప్పుడు వాళ్లు కూడా వచ్చి ప్లాస్మా డొనేషన్ క్యాంపులో పాల్గొన్నారని చెప్పాడు.
చిరంజీవి (Chiranjeevi/Twitter)
చిరంజీవి (Chiranjeevi/Twitter)

అలాగే తమకు తెలిసిన బంధువుల అబ్బాయికి కూడా కరోనా వచ్చిందని.. డాక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో కేవలం ప్లాస్మా డొనేట్ చేయడం వల్లే ఆయన ఆరోగ్యం మెరుగు పడిందని చెప్పాడు అన్నయ్య. అది కూడా తన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు ఇచ్చాడని చెప్పాడు. ఏదేమైనా కూడా చిరంజీవి ఇంట్లోనే కరోనా వచ్చిందనే విషయం తెలిసి అభిమానులు కూడా కంగారు పడ్డారు. అయితే అది తగ్గిపోయిందని తెలిసి ఊపిరి తీసుకున్నారు. ఏదేమైనా వాళ్లందరూ అజాగ్రత్తగా ఉండటం వల్లే కరోనా బారిన పడ్డారని.. అంతా బాగుంది కాబట్టి ఇప్పుడేం సమస్య లేదని చెప్పాడు మెగాస్టార్.
Published by: Praveen Kumar Vadla
First published: August 7, 2020, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading