Chiranjeevi: చిరంజీవి చెప్పిన ఈ 5 నియమాలు పాటిస్తే కరోనా అస్సలు రాదు..!

చిరంజీవి (Chiranjeevi)

Chiranjeevi: కరోనాని ఓడించడం కోసం ప్రజలలో మనోధైర్యం పెంపొందించేందుకు చిన్న పిల్లలతో కలిసి ఓ అద్భుతమైన వీడియో చేసారు చిరంజీవి. అభయ, సహనాలు చెప్పిన ఈ 5 విషయాలని భయం లేకుండా సహనంతో పాటిస్తే కరోనాని ఓడిస్తామంటున్నారు చిరు.

  • Share this:
కరోనాని ఓడించడం కోసం ప్రజలలో మనోధైర్యం పెంపొందించేందుకు చిన్న పిల్లలతో కలిసి ఓ అద్భుతమైన వీడియో చేసారు మెగాస్టార్ చిరంజీవి. అభయ, సహనాలు చెప్పిన ఈ 5 విషయాలని భయం లేకుండా సహనంతో పాటిస్తే కరోనాని మనం తప్పకుండా ఓడించగలము అంటూ ఓ ప్రముఖ ఛానెల్ కోసం యాడ్ చేసారు చిరు. గతంలో కూడా కరోనా నియంత్రణ కోసం ఓ వీడియో చేసారు మెగాస్టార్. ఇప్పుడు కూడా ఇదే చేసారు. ఈయన చెప్పిన 5 నియమాలు పాటిస్తే కరోనా అస్సలు రాదు. ప్రజలను ఇంట్లోనే ఉండాలని.. కరోనా నుంచి కాపాడుకోవాలని సూచిస్తున్నారు మెగాస్టార్. సెకండ్ వేవ్ తీవ్రత రోజురోజుకీ తగ్గుతున్న నేపథ్యంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉండొద్దంటూ హెచ్చరిస్తున్నారు చిరంజీవి. అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే.. మన పనులు మనం చేసుకోవాలంటున్నారు. అంతే కాకుండా కరోనా వచ్చిన వాళ్లకు దూరంగా ఉండాలే కానీ దూరం మాత్రం పెట్టకండి అంటున్నారు ఈయన. అంతేకాదు.. మరికొన్ని నియమాలు కూడా సూచించారు.



1. అన్నింటికంటే ముఖ్కమైంది.. అంతా ఇంట్లోనే ఉండాలి.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయట అడుగుపెట్టాలి..
2. కనీసం 20 నుంచి 30 క్షణాల పాటు రోజులో చాలా సార్లు సబ్బు, నీళ్లతో మీ చేతులు కడుక్కోవాలి.. మీ మొహాన్ని తాకకండి.. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును అసలు తాకకండి..
3. దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు కచ్చితంగా మీ మోచేతులను లేదంటే టిష్యూను అడ్డుగా పెట్టుకోండి. అలాగే సొంత వైద్యం మంచిది కాదు.. డాక్టర్స్ సంరక్షణలోనే ఉండాలి.
4. సోషల్ డిస్టేన్సింగ్ అనేది తప్పదని అర్థం చేసుకోండి.. ఇంట్లో అయినా బయట అయినా ఇతరులకు కనీసం మూడు మీటర్ల దూరంలో ఉండండి. కరోనా వస్తే కనీసం 10 రోజులు దూరంగా ఉండాలి.
5. కరోనా వచ్చిన వాళ్ళకు దూరంగా ఉండండి కానీ దూరం పెట్టకండి. వాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఈ
Published by:Praveen Kumar Vadla
First published: