చరణ్ చెప్పాడు.. చిరంజీవి చేసాడు.. తనయుడి మాటతో..

Chiranjeevi Ram Charan: మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిపోయాడు. కుర్ర హీరోలు కూడా ఈయన జోరు అందుకోలేకపోతున్నారు. ప్రతీ చిన్న విషయాన్ని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 29, 2020, 7:57 PM IST
చరణ్ చెప్పాడు.. చిరంజీవి చేసాడు.. తనయుడి మాటతో..
చిరంజీవి రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిపోయాడు. కుర్ర హీరోలు కూడా ఈయన జోరు అందుకోలేకపోతున్నారు. ప్రతీ చిన్న విషయాన్ని కూడా ఆయన అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తన భావాలు.. అనుభవాలు.. జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు అన్నీ అభిమానులకు కొత్తగా అనిపిస్తున్నాయి. మెగాస్టార్‌లోని మరో కోణాన్ని కూడా వాళ్లకు పరిచయం చేస్తున్నాయి. గతంలో ఏదైనా కావాలంటే.. చెప్పాలంటే ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టేవాడు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.

చిరంజీవి రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)
చిరంజీవి రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)


తను ఏమనుకుంటున్నాడో.. ఏం చెప్పాలనుకుంటున్నాడో ప్రజలకు చేరాలంటే ఉన్న ఒకేఒక్క మార్గం సోషల్ మీడియా.. అందులోకి రావడం. ప్రస్తుతం చిరంజీవి ఇదే చేస్తున్నాడు. సోషల్ మీడియాలో తాను అనుకున్నది అనుకున్నట్లు చెప్పేస్తున్నాడు. ఈ మధ్యే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తన సోషల్ మీడియా ఎంట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. తన అభిప్రాయాలను తన అభిమానులతో చాలాసార్లు పంచుకోవాలని అనిపించినా అప్పటికప్పుడు అలా చేయలేకపోయానని.. ఈ విషయంపై తనలో తానే చాలా మథనపడ్డానని తెలిపాడు మెగాస్టార్.

తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)
తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)


ముఖ్యంగా గతేడాది జరిగిన దిశ ఘటన.. ఆ తర్వాత నిర్భయ ఉరితీత విషయంపై స్పందించాలనుకున్నా సరైన ప్లాట్ ఫామ్ లేక ఊరుకున్నానని చెప్పాడు చిరంజీవి. ఆ సమయంలో తన కుమారుడు రామ్ చరణ్ విలువైన సలహా ఇచ్చాడని.. సోషల్ మీడియాలోకి తనను తీసుకొచ్చాడని వివరించాడు. తనకు మొదట్లో సోషల్ మీడియా తెలియదని.. చరణ్ సలహా ఇచ్చిన తర్వాతే అసలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాని చిరంజీవి తెలిపాడు. మొత్తానికి తనయుడు చెప్పడం.. తండ్రి పాటించడం విచిత్రంగా ఉంది కదా...?
Published by: Praveen Kumar Vadla
First published: April 29, 2020, 7:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading