Megastar Chiranjeevi Family Photo: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటోను ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆమె భార్య సురేఖతో పాటు కుమారుడు రామ్ చరణ్, కుమార్తెలు సుస్మిత,శ్రీజలున్నారు. ఈ ఫోటోను సుస్మిత ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో ఉంది. ఈ ఫోటోను మెగాభినులు తెగ షేర్ చేస్తున్నారు. చిరంజీవి విషయానికొస్తే.. టాలీవుడ్లో అగ్ర కథానాయకుడిగా దాదాపు 20 యేళ్లకు పైగా సత్తా చూపెట్టారు. ఆయన నట వారసుడిగా రామ్ చరణ్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి తండ్రి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు తొలిసారి పూర్తి స్థాయిలో తన తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటిస్తున్నాడు. అంతేకాదు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాతగా సత్తా చాటుతున్నాడు. మరోవైపు చిరంజీవి సతీమణి.. సురేఖ.. మెగా కుటుంబ బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నేరవేరుస్తూనే ఉంది. ఇక చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత గోల్డ్ బ్యాక్స్ అనే బ్యానర్ స్థాపించి వరుసగా వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది.
ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌లో భాగంగా ‘షూటౌట్ అట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ త్వరలో జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో చిరంజీవి కెమియో రోల్ చేసినట్టు సమాచారం. ఇంకోవైపు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. భర్త కళ్యాణ్ దేవ్.. టాలీవుడ్లో హీరోగా సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నాడు. మొత్తంగా చిరంజీవి తన భార్య సురేఖ ముగ్గురు సంతానం రామ్ చరణ్, సుస్మిత, శ్రీజతో కలిసి ఫోటో మాత్రం నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.