• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MEGASTAR CHIRANJEEVI RAM CHARAN KORATALA SIVA ACHARYA MOVIE SHOOTING UPDATE AND 15 MORE DAYS TO BALANCE PK

Acharya Shooting update: చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ అప్‌డేట్.. ఇంకా అన్ని రోజులు బ్యాలెన్స్..

Acharya Shooting update: చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ అప్‌డేట్.. ఇంకా అన్ని రోజులు బ్యాలెన్స్..

చిరంజీవి ఆచార్య (Chiranjeevi Acharya)

Acharya Shooting update: ఏడాదికి రెండు సినిమాలు చేయాలని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్లాన్ చేసుకుంటే రెండేళ్లకు ఒక్క సినిమా కూడా రాకుండా చేసింది కరోనా వైరస్. కేవలం ఈ మహమ్మారి కారణంగానే సైరా(Sye Raa) తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేకపోయారు చిరంజీవి.

  • Share this:
అనుకున్నదొకటి.. అయినదొక్కటి అంటే ఇదేనేమో..? లేకపోతే మరేంటి.. ఏడాదికి రెండు సినిమాలు చేయాలని మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేసుకుంటే రెండేళ్లకు ఒక్క సినిమా కూడా రాకుండా చేసింది కరోనా వైరస్. కేవలం ఈ మహమ్మారి కారణంగానే సైరా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేకపోయారు చిరంజీవి. ప్రస్తుతం ఈయన ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సైరా సినిమా కొన్ని వర్గాలను మాత్రమే ఆకట్టుకుంది. తెలుగులో యావరేజ్ దగ్గరే ఆగి.. మిగిలిన భాషల్లో ఫ్లాప్ అయింది. దాంతో సైరా లోటు కూడా ఇప్పుడు తీర్చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్. అందుకే ఆచార్య కోసం టైమ్ ఎంత తీసుకున్నా పర్లేదు కానీ పక్కా స్క్రిప్ట్ కావాలని ముందు నుంచి కొరటాలకు కండీషన్ పెట్టాడు చిరంజీవి. ఆ కారణంగానే సినిమాకు ఇన్ని రోజులు పట్టింది. అయితే మధ్యలో కరోనా కూడా రావడంతో అనుకున్న దాని కంటే మరింత ఆలస్యం అవుతుంది. అనుకున్నట్లుగానే మెగాస్టార్ మనసు దోచేలా ఆచార్య తెరకెక్కిస్తున్నాడు కొరటాల.

మరికొన్ని రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. అయితే ఇంకా ఎన్ని రోజులు ఉందనేది చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తున్న విషయం. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా 15 రోజుల షూటింగ్ బాకీ ఉందని తెలుస్తుంది. అందులో రామ్ చరణ్, చిరు కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయి. వీటిని జూన్‌లో పూర్తి చేయాలని చూస్తున్నారు కొరటాల శివ. సినిమాను ముందు మే 13న విడుదల చేయాలని ముందు నుంచి అనుకున్నారు కానీ కరోనా కారణంగా మరోసారి వాయిదా పడింది.
acharya movie shooting update,chiranjeevi acharya movie release in august 22,acharya movie release date august 22,acharya movie nizam rights 42 crore warangal srinu,acharya movie pre release business,chiranjeevi acharya movie,acharya movie teaser reactions,telugu cinema,ఆచార్య,ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 22,ఆచార్య ఓవర్సీస్ రైట్స్,ఆచార్య షూటింగ్ అప్ డేట్
‘ఆచార్యలో రామ్ చరణ్, పూజా హెగ్డే (Twitter/Photo)

ఈ సినిమాను చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దుమ్ము దులిపేస్తున్నాడు మెగాస్టార్. చిరు గత సినిమాల రికార్డులన్నీ తిరగరాసేలా కుమ్మేస్తున్నాడు అన్నయ్య. నైజాంలో ఇప్పటికే వరంగల్ శ్రీను 42 కోట్లకు రైట్స్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆంధ్రా, సీడెడ్ కలిపి 60 కోట్లకు పైగానే ఆచార్య బిజినెస్ జరుగుతుంది. మరోవైపు ఓవర్సీస్ కూడా అన్నయ్య రేంజ్‌కు ఏ మాత్రం తీసిపోవడం లేదు. అక్కడా ఆచార్య అదరగొడుతున్నాడు.
acharya movie shooting update,chiranjeevi acharya movie release in august 22,acharya movie release date august 22,acharya movie nizam rights 42 crore warangal srinu,acharya movie pre release business,chiranjeevi acharya movie,acharya movie teaser reactions,telugu cinema,ఆచార్య,ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 22,ఆచార్య ఓవర్సీస్ రైట్స్,ఆచార్య షూటింగ్ అప్ డేట్
‘ఆచార్య’లో చిరంజీవి, రామ్ చరణ్ (Twitter/Photo)

ఖైదీ నెం 150, సైరా సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి వసూళ్లే రావడంతో ఇప్పుడు ఆచార్యకు కూడా అదే స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. 20 కోట్లకు పైగానే ఓవర్సీస్ రైట్స్ నిర్మాతలు కోట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే కానీ నిజమైతే ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ 140 కోట్ల వరకు జరుగుతున్నట్లే లెక్క. అంటే ఈ సినిమా హిట్ కొట్టాలంటే 150 కోట్ల వరకు షేర్ వసూలు చేయాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు