Acharya - Chiranjeevi - Ram Charan | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రంపై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోవిడ్ ఆంక్షల తర్వాత రీసెంట్గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే యువ విద్యార్ధి నాయకుడు పాత్రతో పాటు నక్సలైట్‌గా కూడా కనిపించనున్నట్టు సమాచారం. ఈ పాత్రను కేవలం రామ్ చరణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసాడు కొరటాల. ఇప్పటికే మగధీర, బ్రూస్లీ, ఖైదీ నెం 150 సినిమాల్లో కలిసి కనిపించారు చిరు, రామ్ చరణ్. కానీ అవన్నీ కొన్ని నిమిషాల పాటు వచ్చి మాయం అవుతుంటాయి. కానీ ఆచార్యలో అలా కాదు.. దాదాపు చిరంజీవి, రామ్ చరణ్ స్క్రీన్ పై అరగంటకు పైనే ఉంటుందని సమాచారం. కానీ కొరటాల శివ మాత్రం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రను గంట వరకు పొడిగించినట్టు సమాచారం.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 29న సాయంత్రి 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ పై కొన్ని కాంబినేషన్స్ సీన్స్ ఉన్నాయట. ఈ సన్నివేశాలను నెక్ట్స్ షెడ్యూల్లో రాజమండ్రికి సమీపంలోని మారేడుమిల్లి అనే అడవిలో చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్.. అక్కడ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఆచార్యలో చిరంజీవి (Twitter/Photo)
ఈ నెల 7నుంచి ఈ షెడ్యూల్ మొదలు కానుంది.ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కంప్లీట్ కానుంది. ఈ షెడ్యూల్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్టు సమాచారం.
చిరంజీవి సినిమాకు చాలా ఏళ్ళ తర్వాత మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిన తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ కాకుండా బయటి మ్యూజిక్ డైరెక్టర్‌తో కొరటాల పని చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 27, 2021, 17:32 IST