‘సైరా’ విజయంతో భావోద్వేగంలో చిరంజీవి, చరణ్

Sye raa: రామ్ చరణ్ నిర్మాతగా చిరు హీరోగా నటించిన మూవీ సైరా. దీంతో సైరా మెగా అభిమానులు కోటి ఆశలు పెట్టుున్నారు.

news18-telugu
Updated: October 2, 2019, 12:42 PM IST
‘సైరా’ విజయంతో భావోద్వేగంలో చిరంజీవి, చరణ్
సైరా సక్సెస్‌‌తో ఆనందలో చిరంజీవి, రామ్ చరణ్
  • Share this:
చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4620 థియేటర్లలో సైరా విడుదలైంది. సైరా విడుదల నేపథ్యంలో.. సినిమా రిజల్ట్ గురించి అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ట్విట్టర్‌లో ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. చిరు అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. ఓవర్‌సీస్ రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండటం.. చిరు నటన అద్భుతంగా ఉందన్న ప్రశంసలు వినిపిస్తుండటంతో.. సైరాటీం అంతా సంతోషంలో మునిగి తేలిపోతుంది. ఇక చిరంజీవి, రామ్ చరణ్ సంతోషానికి అవధులు లేవు.

చరణ్‌ను అప్యాయంగా హత్తుకున్న చిరంజీవి


రామ్ చరణ్ నిర్మాతగా చిరు హీరోగా నటించిన మూవీ సైరా. దీంతో సైరా మెగా అభిమానులు కోటి ఆశలు పెట్టుున్నారు. వారి ఆశలు నిజమయ్యేలా చిరు సైరా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతోంది. 'ఈ బాస్ బస్టర్ కు ధన్యవాదాలు నాన్నా' అని తన తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు చెర్రీ. తన తండ్రి తనను గుండెలకు హత్తుకొని ముద్దాడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

చిరంజీవి, రామ్ చరణ్ భావోద్వేగాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్‌ను ఎంతో అప్యాయంగా చిరంజీవి హత్తుకున్న ఫోటోలు, ముద్దు పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సైరా విజయంతో పాటు... చిరు చరణ్‌ల భావోద్వేగాలకు సంబంధించిన ఫోటోలతో మెగా అభిమానులు దసరా పండగను వారం ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

సైరా విజయానందంలో రామ్ చరణ్, చిరంజీవి


First published: October 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు