MEGASTAR CHIRANJEEVI RAM CHARAN AND OTHER TOLLYWOOD STARS FACILITATES OLYMPIC MEDAL WINNER PV SINDHU AT HIS HOME SK
PV Sindhu | Chiranjeevi: చిరు ఇంట్లో పీవీ సింధు సందడి.. వీడియో విడుదల చేసిన మెగాస్టార్
పీవీ సింధుతో చిరంజీవి, రామ్ చరణ్
PV Sindhu | Chiranjeevi: బ్యాడ్మింటన్లో సంచలనాలు సృష్టిస్తూ.. తెలుగు ఖ్యాతిని విశ్వవాప్తం చేసిన పీవీ సింధును చిరంజీవి కొనియాడారు. సింధును చూసి దేశం మురిసిపోతుంటే తన బిడ్డే అనే భావన కలిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచి తెలుగు జాతి కీర్తిని మరోసారి ప్రపంచానికి చాటింది పీవీ సింధు. వరుసగా రెండు సార్లు ఒలింపిక్ పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. భారత దేశానికి గర్వ కారణమైన ఈ తెలుగు తేజాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సత్కరించారు. హైదరాబాద్లోని తన నివాసంలో ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రత్యేక సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగార్జున, రానా దగ్గుబాటి, అఖిల్, శర్వానంద్, సీనియర్ నటీమణులు రాధిక, సుహాసినితో పాటు పలువురు ప్రముఖులు హాజరై పీవీ సింధూను ఘనంగా సన్మానించారు. ఆగస్టు 20న ఈ కార్యక్రమం జరిగింది. ఆ వీడియోను శనివారం సాయంత్రం తన ఇన్స్టగ్రామ్ ఖాతాలో విడుదల చేశారు చిరంజీవి.
బ్యాడ్మింటన్లో సంచలనాలు సృష్టిస్తూ.. తెలుగు ఖ్యాతిని విశ్వవాప్తం చేసిన పీవీ సింధును చిరంజీవి కొనియాడారు. సింధును చూసి దేశం మురిసిపోతుంటే తన బిడ్డే అనే భావన కలిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇక చిరంజీవి కుటుంబం తనపై చూపించిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటాని చెప్పింది సింధు. వచ్చే ఒలింపిక్స్లో ఖచ్చితంగా స్వర్ణ పతకాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. సింధును సత్కరించిన తర్వాత చిరు నివాసంలోనే విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన పంచ్లతో నవ్వులు పూయించారు చిరంజీవి. కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలించిన పీవీ సింధూ.. మన దేశంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. ఇప్పటిదాకా ఈ ఘనతను సాధించిన భారత్ అథ్లెట్ సుశీల్ కుమార్ ఒక్కడే. వరుస ఒలింపిక్స్లో అతను రజతం, కాంస్య పతకాలను సాధించాడు. గత ఒలిపింక్స్లోనూ సింధూ పతకం సాధించిన విషయం తెలిసిందే. రియోలో జరిగిన ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. ఈసారి గోల్డ్ మెడల్ గెలుస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ సెమీ ఫైనల్లో ఓడిపోవడంతో బంగారంతో పాటు వెండి పతకాలు చేజారాయి. కాంస్యం కోసం జరిగిన పోరులో అద్భుతంగా ఆడి మెడల్ గెలిచింది పీవీ సింధు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఒలింపిక్ పతక విజేతను ఘనంగా సన్మానించారు.పతకం గెలిస్తే సింధుకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపిస్తానని మోదీ ఒలింపిక్ క్రీడకు ముందు మాట ఇచ్చారు. ఆమె కాంస్యం పతకం గెలవడంతో.. చెప్పినట్లుగానే ఆగస్టు 16న సోమవారం ఐస్ క్రీమ్ తెప్పించి ఇచ్చారు. ఇతర క్రీడాకారులకు కూడా తమకు ఇష్టమైన వంటకాలను వడ్డించారు. అంతకు ముందు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా పీవీ సింధును ఘనంగా సన్మానించారు. ఆ సందర్భంగా సింధూకు రూ.30లక్షల చెక్కును నజరానాగా అందించారు. అంతేకాదు విశాఖలో రెండు ఎకరాల స్థలంలో అకాడమీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.