చిరంజీవి ఆచార్య షూటింగ్ (Chiranjeevi Acharya Shooting)
Chiranjeevi Acharya location pics: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రస్టేజియస్ సినిమా ఆచార్య. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో మెగా వారసుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రస్టేజియస్ సినిమా ఆచార్య. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో మెగా వారసుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం చిరు, చరణ్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు కొరటాల. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. దీనికోసం భారీగానే టీం కూడా అక్కడికి వెళ్లింది. ఈ మధ్యే షూటింగ్ మొదలైంది. ఇన్ని రోజుల తర్వాత ఆచార్య సెట్లోకి రామ్ చరణ్ కూడా రెగ్యులర్‌గా వస్తున్నాడు. ఇందులో సిద్ధ పాత్రలో నటిస్తున్నాడు చరణ్. తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగానే గర్వంగా ఉందని చెప్తున్నాడు రామ్ చరణ్. ఆచార్య కోసం తాను ఆసక్తిగా వేచి చూస్తున్నట్లు చెప్పాడు మెగా వారసుడు. తన తల్లి సురేఖ డ్రీమ్ ఇది అని.. తండ్రితో కలిసి నటించడం కలలా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు చరణ్. ఇదిలా ఉంటే మారేడుపల్లిలో జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్లో కుర్రాడిలా మారిపోయాడు మెగాస్టార్. ఆయన వెనకాలే రామ్ చరణ్ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి విడుదలైంది. అందులో అక్కడికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తున్నాడు మెగాస్టార్.
ఆయనతో పాటు రామ్ చరణ్ కూడా అభిమానులకు నమస్కారం చేస్తున్నాడు. ఈ వీడియోతో పాటు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయిప్పుడు. కాజల్ అగర్వాల్ ఆచార్యలో చిరుతో జోడీ కడుతుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. మే 13న ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య సినిమా విడుదల కానుంది.