ఎన్టీఆర్, మహేష్, నితిన్‌లకు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు..

ఎన్టీఆర్,మహేష్,నితిన్‌లను మెచ్చుకున్న చిరంజీవి (File/Photos)

Chiranjeevi Twitter | మెగాస్టార్ చిరంజీవి తెలుగు వారి కొత్త యేడాది ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఆయన వరుస ట్వీట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా చిరంజీవి మహేష్ బాబు, ఎన్టీఆర్, నితిన్‌లను ప్రశంసలతో ముంచెత్తారు.

 • Share this:
  మెగాస్టార్ చిరంజీవి తెలుగు వారి కొత్త యేడాది ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కేవలం 24 గంటల్లోనే చిరంజీవిని 1 లక్ష 49 వేల మంది ఫాలో అవతున్నారు. ఈ సందర్భంగా ఆయన వరుస ట్వీట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన హీరో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ట్వీట్ పై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. చిరంజీవికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత చిరంజీవి..కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రామ్ చరణ్‌తో చేసిన వీడియో ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిందన్నారు.


  మరోవైపు మహేష్ బాబు చిరంజీవి ట్విట్టర్‌లో అడుగుపెట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తూ వెల్‌కమ్ చెప్పిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు చిరంజీవి మహేష్ బాబు ట్వీట్ పై స్పందిస్తూ.. కరోనా సందర్భంగా మహేష్ బాబు చెప్పిన ఆరు సూత్రాలను మెచ్చుకున్నారు. ఈ ఆరు సూత్రాలను పాటిస్తే... ప్రజలందరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటారన్నారు.  మరోవైపు కరోనా పై పోరాటంలో భాగంగా హీరో నితిన్ రెండు తెలుగు రాష్ట్ర సీఎం సహాయ నిధికి చెరో రూ.10 లక్షల విరాళం ప్రకటించంపై హర్షం వ్యక్తం చేసారు. మరోవైపు హీరో నితిన్.. ట్విట్టర్‌లో అడుగపెట్టిన బిగ్‌బాస్‌కు స్వాగతం అంటూ ఆయన ట్వీట్‌కు రీ ట్వీట్ చేసాడు. మొత్తానికి చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టడమే కాకుండా.. తనవంతుగా సమాజానికి పాడుపడే హీరోలను అభినందిస్తూ వారికి స్పూర్తిగా నిలుస్తున్నరంటూ అభిమానులతో పాటు సాధారణ ప్రజలు చిరంజీవి తీరును ప్రశంసిస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published: