తమన్నాపై చిరంజీవి ప్రశంసల వర్షం.. నయనతారపై మెగా సెటైర్లు..

సైరా సినిమాను మెగా కుటుంబం మరిచిపోలేకపోతుంది. ఈ సినిమా విడుదలై వారం దాటేసినా కూడా ఇప్పటికీ ప్రమోషన్స్ చేస్తూ బిజీగానే ఉన్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ ముందు నుంచి కూడా నయనతార రాలేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 10, 2019, 8:42 PM IST
తమన్నాపై చిరంజీవి ప్రశంసల వర్షం.. నయనతారపై మెగా సెటైర్లు..
సైరా పోస్టర్ Twitter
  • Share this:
సైరా సినిమాను మెగా కుటుంబం మరిచిపోలేకపోతుంది. ఈ సినిమా విడుదలై వారం దాటేసినా కూడా ఇప్పటికీ ప్రమోషన్స్ చేస్తూ బిజీగానే ఉన్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ ముందు నుంచి కూడా నయనతార రాలేదు. ఒక్కటంటే ఒక్కదానికి కూడా నయన్ రాలేకపోయింది. రామ్ చరణ్ అడిగినా కూడా రానని మొహం మీదే చెప్పడంతో ఆమెను పట్టించుకోవడం మానేసారు చిరంజీవి, చిత్రయూనిట్. అయితే సినిమా విడుదలైన తర్వాత కూడా నయనతార కనీసం ఒక్క ప్రెస్ మీట్‌కు కూడా రాకపోవడం నిజంగానే అందరికీ ఆశ్చర్యం వేసేలా చేసింది. ఇంత భారీ సినిమాకు ఆమె కనీసం వస్తుందని ఊహించారు అభిమానులు.

nayanthara vogue,nayanthara age,nayanthara new movies,nayanthara songs,nayanthara latest movies,nayanthara sye raa,tamanna nayanthara sye raa movie,నయనతార,తమన్నా,సైరా నరసింహారెడ్డి,సిద్ధమ్మ,లక్ష్మి,నయనతార వయసు,నయనతార సినిమా,
సైరాలో నయనతార


పైగా చిరంజీవి సినిమా కాబట్టి వస్తుందేమో అనుకున్నారు కానీ నయన్ మాత్రం నాకు ఎవరైనా ఒక్కటే అనేసింది. కానీ తమన్నా మాత్రం సినిమా విడుదలైన క్షణం నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది. ఏ చిన్న ప్రెస్ మీట్ జరిగినా కూడా సైరా కోసం అడుగు ముందుకేసింది. ప్రమోషన్స్‌లో చిరంజీవితో పాటే అన్నిచోట్లకు కూడా తిరుగుతూనే ఉంది. ఇంకా రామ్ చరణ్ అక్కడక్కడా మిస్ అయ్యాడేమో కానీ తమన్నా మాత్రం ప్రతీచోట కనిపించింది. దాంతో చిరంజీవి మనసు కూడా బాగానే గెలిచేసింది ఈమె. చూస్తుంటే తమన్నాకు తన తర్వాత సినిమాలో కూడా అవకాశం ఇచ్చేలా కనిపిస్తున్నాడు మెగాస్టార్.

Megastar Chiranjeevi praised Tamannaah and satires on Nayanthara regarding Sye Raa movie promotions pk సైరా సినిమాను మెగా కుటుంబం మరిచిపోలేకపోతుంది. ఈ సినిమా విడుదలై వారం దాటేసినా కూడా ఇప్పటికీ ప్రమోషన్స్ చేస్తూ బిజీగానే ఉన్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ ముందు నుంచి కూడా నయనతార రాలేదు. chiranjeevi,chiranjeevi tamannaah,chiranjeevi movies,chiranjeevi satires nayanthara,nayanthara,nayanthara twitter,nayanthara instagram,nayanthara hot,nayanthara hot images,nayanthara sye raa movie,nayanthara sye raa movie promotion,nayanthara chiranjeevi,telugu cinema,sye raa pre release,nayanthara Ram charan,nayanthara promotion,నయనతార,నయనతార చిరంజీవి,చిరంజీవి సైరా ప్రమోషన్స్,నయనతార ప్రమోషన్స్,తెలుగు సినిమా
నయనతార తమన్నా


బహుశా తమ్మూ మనసులో కూడా ఇదే పెట్టుకుని ప్రతీ ప్రమోషన్ కార్యక్రమానికి వచ్చిందేమో..? ఇక ఇప్పుడు సుబ్బిరామిరెడ్డి ఇచ్చిన పార్టీలో తమన్నాను ఆకాశానికి ఎత్తేసాడు చిరంజీవి. సినిమాలో తన తర్వాత అంత ఇంపాక్ట్ ఉన్న పాత్ర చేసింది తమన్నానే అని.. ఆమెకే అంత పేరొచ్చిందని చెప్పాడు చిరు. తాను ప్రమోషన్స్‌కు రాను అని నయనతార చెప్పినట్లుగా చెబితే తాము చేసేదేమీ ఉండదని.. కానీ తమన్నా అలా కాకుండా సినిమాను ఓన్ చేసుకుని ప్రతీ ప్రమోషనల్ వేడుకకు రావడం ఆనందంగా ఉందని చెప్పాడు మెగాస్టార్.

తమన్నాకు గిఫ్టులు కూడా ఇస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. ఈ మధ్యే రింగ్ కూడా ఇచ్చాడు మెగా నిర్మాత. మరోవైపు నయనతారకు మాత్రం వరసగా సెటైర్లు పడుతూనే ఉన్నాయి. సైరా విషయంలో నయన్ నిజంగానే ఇది ఊహించి ఉండదు. అక్కడ సినిమాలో కారెక్టర్ పేలక.. బయట కూడా విమర్శలు రావడంతో అమ్మడు ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది.
Published by: Praveen Kumar Vadla
First published: October 10, 2019, 8:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading