రామ్ చరణ్ పుట్టినపుడు ఆ సంతోషం చిరంజీవి మాటల్లో..

Ram Charan Chiranjeevi: తన జీవితంలో అన్నింటికంటే విలువైన వరం రామ్ చరణ్ అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు చిరు. ఇప్పుడు కూడా ఇదే అంటున్నాడు. మార్చ్ 27న చరణ్ పుట్టిన రోజు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 8:46 PM IST
రామ్ చరణ్ పుట్టినపుడు ఆ సంతోషం చిరంజీవి మాటల్లో..
చిరంజీవి రామ్ చరణ్ (chiranjeevi ram charan)
  • Share this:
తండ్రికి పుత్రోత్సాహం ఆ పుత్రుడు జనయించినపుడు కాదు.. జనులా పుత్రున్ని చూసి పొగిడినపుడు అంటారు. ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే అనుభవిస్తున్నాడు. తనయుడిని చూసి అంతా మెచ్చుకుంటుంటే తను ఆ పుత్రోత్సాహాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మెగాస్టార్. తన జీవితంలో అన్నింటికంటే విలువైన వరం రామ్ చరణ్ అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు చిరు. ఇప్పుడు కూడా ఇదే అంటున్నాడు. మార్చ్ 27న చరణ్ పుట్టిన రోజు. దాంతో తనయుడికి ఆత్మీయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు చిరంజీవి. చరణ్ పుట్టినపుడు తను ఈ భూమ్మీద లేనని.. అంతగా ఆనందపడ్డానని చెప్పాడు మెగాస్టార్. 

View this post on Instagram
 

I was naturally overjoyed when Charan was born. ‪It was only much later that it occurred to me there was perhaps a reason why he was born on the #WorldTheatreDay 27th March - ‘Prapancha ‘Rangasthala’ dinotsavam’ ! He took to acting like a fish to water. On the eve of @alwaysramcharan 's birthday, Many Many Happy Returns #Charan ! ‬ ‪#ThrowbackPic


A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

వాడు పుట్టగానే నాకు మాటల్లో చెప్పలేని సంతోషం వచ్చిందంటూ చరణ్‌ను చిన్నపుడు లాలిస్తున్న ఫోటోను షేర్ చేసాడు మెగాస్టార్. అది చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. దాంతో పాటు చరణ్ పుట్టిన రోజే ప్రపంచ రంగస్థల దినోత్సవం కావడం కూడా విశేషం అని చెప్పాడు చిరంజీవి.

చిరంజీవి రామ్ చరణ్ (chiranjeevi ram charan)
చిరంజీవి రామ్ చరణ్ (chiranjeevi ram charan)


అందుకే చరణ్‌కు నటన అంటే నీటిలో ఉన్న చేపకు ఈత నేర్పినట్లు అంటూ తన కొడుకు నటన గురించి ప్రశంసించాడు మెగాస్టార్. నువ్విలాంటి పుట్టిన రోజులు ఇంకెన్నో జరుపుకోవాలంటూ ఆప్యాయంగా తనయుడికి బర్త్ డే విషెస్ చెప్పాడు మెగాస్టార్. దానికి ఆ ఫోటోను కూడా జత చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు చిరు.
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు