Chiranjeevi: చిరంజీవి తీసిన ఈ ఫోటోలో ఉన్న స్టార్ ఎవరో తెలుసా..?

Chiranjeevi: సోషల్ మీడియాలో జాయిన్ అయిన తర్వాత ప్రతీ చిన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకోవడం అలవాటు చేసుకున్నాడు చిరంజీవి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 19, 2020, 6:05 PM IST
Chiranjeevi: చిరంజీవి తీసిన ఈ ఫోటోలో ఉన్న స్టార్ ఎవరో తెలుసా..?
చిరంజీవి పవన్ కళ్యాణ్ (chiranjeevi pawan kalyan)
  • Share this:
సోషల్ మీడియాలో జాయిన్ అయిన తర్వాత ప్రతీ చిన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకోవడం అలవాటు చేసుకున్నాడు చిరంజీవి. దాదాపు రోజూ తన ముచ్చట్లు సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తున్నాడు. ఏదైనా స్పెషల్ డేస్ వస్తే ఇంకా యాక్టివ్ అవుతున్నాడు మెగాస్టార్. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. తాజాగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 19న ఓ స్పెషల్ ఫోటో ట్వీట్ చేసాడు చిరంజీవి. ఫోటోలు మన జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతాయంటున్నాడు చిరు.


ఎన్నో మధురమైన.. మరిచిపోలేని జ్ఞాపకాలను మనకు అందించడంలో ముందుంటుంది ఫోటో. ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే చేసాడు. తన జీవితంలో తీసిన మొదటి ఫోటోను అభిమానుల కోసం షేర్ చేసాడు. అంతేకాదు అందులో ఓ ప్రత్యేకత కూడా ఉంది.. అది కనిపెట్టమని ప్రశ్నించాడు మెగాస్టార్. చిరంజీవి తీసిన ఆ ఫోటోలో ఐదుగురు చిన్న పిల్లలు వరసగా నిలబడ్డారు.

అందులో ఒకరు మీకు బాగా తెలుసు అంటూ హింట్ ఇచ్చాడు మెగాస్టార్. నేను తీసిన మొదటి ఫోటో ... ... ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు ... ...చెప్పుకోండి చూద్దాం అంటూ ఫజిల్ వదిలాడు చిరంజీవి. అది చూసిన తర్వాత ఎవరనేది ఇట్టే గమనించవచ్చు. ఎందుకంటే అక్కడున్న ఫోటోలో పవర్ అలాంటిది మరి. అవును.. ఆ ఐదుగురిలో మధ్యలో నిల్చున్న పిల్లాడు ఎవరో కాదు.. పవన్ కళ్యాణ్. పసివాడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అంటూ అభిమానులు కూడా ట్వీట్ చేస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: August 19, 2020, 6:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading