‘సైరా’ కోసం చిరంజీవి అదిరిపోయే మెగా ప్లాన్..వర్కౌట్ అయితే బ్లాక్ బస్టరే..

అవును.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాను హిందీతో పాటు దక్షిణాదితో పాటు అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో ఈ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చేందకు మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ ప్లాన్ వేసాడు. అదేమిటంటే..

news18-telugu
Updated: September 11, 2019, 7:15 AM IST
‘సైరా’ కోసం చిరంజీవి అదిరిపోయే మెగా ప్లాన్..వర్కౌట్ అయితే బ్లాక్ బస్టరే..
సైరా పోస్టర్ (Source: Twitter)
  • Share this:
అవును.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో మిగతా దక్షిణాదిలో ఉన్న కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో ఈ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చేందకు మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ ప్లాన్ వేసాడు. అదేమిటంటే..‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెలుగులో వెర్షన్‌లో చిరంజీవి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే విధంగా వివిధ భాషల్లో ఆయా భాషలకు చెందిన నటీనటులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే వివిధ భాషల్లో ఈ సినిమాను వేరే విధంగా ఎడిటింగ్‌ను దగ్గరుండి చేయిస్తున్నాడు చిరంజీవి.

Megastar Chiranjeevi revealed a shocking fact behind Sye Raa Narasimha Reddy Shooting in Cine Mahotsavam 2019 pk అవును.. నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. మెగాస్టార్ ఏంటి.. సైరా కోసం కాళ్లు పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఎంత మెగాస్టార్ అయినా కూడా 250 కోట్ల సినిమా కదా.. cine mahotsavam 2019,cine mahotsavam 2019 dance,chiranjeevi,sye raa,sye raa movie,sye raa movie twitter,chiranjeevi sye raa movie twitter,sye raa shooting,sye raa ram charan,sye raa falaknuma palace,sye raa falaknuma palace shooting,chiranjeevi sye raa falaknuma palace,chiranjeevi cine mahotsavam 2019,chiranjeevi mahesh babu,చిరంజీవి,చిరంజీవి సైరా,చిరంజీవి సినీ మహోత్సవం 2019,చిరంజీవి ఫలక్‌నుమా ప్యాలెస్,తెలుగు సినిమా,చిరంజీవి సైరా నరసింహారెడ్డి
సైరా పోస్టర్ (Source: Twitter)


హిందీ వెర్షన్ విషయానికొస్తే.. అమితాబ్ బచ్చన్, తమన్నా పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారకు ఎక్కువ నిడివి ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. కన్నడలో సుదీప్ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. మలయాళంలో మాత్రం తెలుగు వెర్షన్ ఎడిటింగ్‌తోనే రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హిందీలో రూ.45 కోట్లు బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి రూ.40 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఆడియోను ఈ నెల 18న కర్నూలులో నిర్వహించనున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 11, 2019, 7:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading