అవును.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో మిగతా దక్షిణాదిలో ఉన్న కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో ఈ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చేందకు మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ ప్లాన్ వేసాడు. అదేమిటంటే..‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెలుగులో వెర్షన్లో చిరంజీవి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే విధంగా వివిధ భాషల్లో ఆయా భాషలకు చెందిన నటీనటులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వివిధ భాషల్లో ఈ సినిమాను వేరే విధంగా ఎడిటింగ్‌ను దగ్గరుండి చేయిస్తున్నాడు చిరంజీవి.
హిందీ వెర్షన్ విషయానికొస్తే.. అమితాబ్ బచ్చన్, తమన్నా పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం.. తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారకు ఎక్కువ నిడివి ఉండేటట్టు ప్లాన్ చేసారట. కన్నడలో సుదీప్ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. మలయాళంలో మాత్రం తెలుగు వెర్షన్ ఎడిటింగ్తోనే రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హిందీలో రూ.45 కోట్లు బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి రూ.40 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ‘సైరా..నరసింహారెడ్డి’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి
‘సైరా’పై బాలీవుడ్లో కుట్ర.. థియేటర్లు ఇవ్వకుండా యశ్‌రాజ్ ఫిల్మ్స్ యత్నం..
బెంగాలీ ఎంపీలు చేసిన ఈ డాన్స్ చూస్తే చూపుతిప్పుకోలేరు..
‘వాల్మీకి’ టైటిల్ మార్పుపై హరీష్ శంకర్ డబుల్ గేమ్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Bollywood, Chiranjeevi, Pawan kalyan, Ram Charan, SS Rajamouli, Sye Raa Narasimha Reddy Movie Review, Sye raa narasimhareddy, Tollywood