టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ఏమిటో అందరికీ తెలుసు. కొన్నేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇచ్చినా... బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లు వసూలు చేసి స్టార్ హీరో చిరంజీవి. గత నెల తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన చిరంజీవి... ఆ సినిమాతో ఆడియెన్స్‌ను ఎంటర్ టైన్ చేయడంలో బాగానే సక్సెస్ అయ్యారు. ఇక సైరా తరువాత కొరటాల శివ డైరెక్షన్లో నటించాలని ముందుగానే ఫిక్స్ అయిన మెగాస్టార్... ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇందుకోసం బరువు తగ్గడంతో పాటు లుక్‌ను కాస్త మార్చుకునే పనిలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో... తన నయా మూవీతో ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ ఇవ్వాలని గట్టిగా డిసైడయినట్టు తెలుస్తోంది.
కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని మెగాస్టార్ టార్గెట్ పెట్టుకున్నారని సమాచారం. కొరటాల శివ కూడా ఇందుకు తగ్గట్టుగానే షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన వెంటనే... సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్‌తో పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. సైరా విషయంలో రెండేళ్ల పాటు అభిమానులను, ప్రేక్షకులను వెయిటింగ్లో పెట్టిన మెగాస్టార్... ఈ సారి అలా జరగకుండా చూడాలని గట్టిగా డిసైడయ్యారు. ఈ కొత్త సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిరంజీవి భావిస్తున్నారు.
నిజానికి ఈ రకంగా నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేయడమంటే... ఇప్పుడున్న దర్శకుల్లో పూరి జగన్నాధ్ ముందుంటారు. మరి... ఈ రకంగా చిరంజీవితో తెరకెక్కించే సినిమాను కొరటాల శివ అంత స్పీడ్‌గా తీస్తారా... ఈ విషయంలో చిరంజీవి కూడా అంత దూకుడుగా ముందుకు సాగుతారా అన్నది చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.