హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi call to MLA: TRS ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన చిరంజీవి.. నీకు నేనున్నా అంటూ భరోసా..!

Chiranjeevi call to MLA: TRS ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన చిరంజీవి.. నీకు నేనున్నా అంటూ భరోసా..!

Chiranjeevi Photo : Twitter

Chiranjeevi Photo : Twitter

Chiranjeevi call to MLA: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రాజకీయాలను వదిలేసి చాలా రోజులు అయిపోయింది. హాయిగా ఈయన ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నాడు. అయినా కూడా చిరంజీవికి రాజకీయ నాయకులతో సత్సంబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఓ తెలంగాణ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి పలకరించారు.

ఇంకా చదవండి ...

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను వదిలేసి చాలా రోజులు అయిపోయింది. హాయిగా ఈయన ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నాడు. అయినా కూడా చిరంజీవికి రాజకీయ నాయకులతో సత్సంబంధాలే ఉన్నాయి. గత అనుభవాల కారణంగా ఈయనకు మంచి స్నేహితులు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది సినిమా వాళ్ళు సాయం చేస్తున్నారు. రియల్ హీరోస్ అనిపించుకుంటున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్ని జిల్లాలకు కూడా ఆక్సీజన్ సిలిండర్స్‌ను సరఫరా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మొన్నటి వరకు సోనూ సూద్ సాయం చేస్తుంటే తెలుగు హీరోలు చోద్యం చూస్తూ కూర్చున్నారా అంటూ విమర్శించిన వాళ్లకు చిరంజీవి తన సాయంతోనే సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన అన్ని జిల్లాల్లో ఉన్న తన సన్నిహితులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అవసరమైన చోటకు ఆక్సిజన్ సిలిండర్లు పంపి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు మెగాస్టార్.

ఈ క్రమంలోనే ఆయన ఓ తెలంగాణ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి పలకరించారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లను పంపించిన చిరంజీవి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బయట జనాల్లోనే ఎక్కువగా తిరుగుతున్నారు.. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి అంటూ సలహా ఇచ్చారు.

Chiranjeevi,Chiranjeevi twitter,Chiranjeevi instagram,Chiranjeevi oxygen cylinders,Chiranjeevi covid help,Chiranjeevi call to MLA shankar naik,telugu cinema,చిరంజీవి,ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన చిరంజీవి,శంకర్ నాయక్‌తో చిరంజీవి ఫోన్ పలకరింపు
చిరంజీవి ఆచార్య (Chiranjeevi Acharya)

ఇదే విషయం ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. తనకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసారంటూ తెలిపారు ఈయన. అంతేకాదు.. మానుకోట తన అభిమాన కోట అంటూ మెగాస్టార్ చిరంజీవి సదరు ఎమ్మెల్యేతో మాట్లాడారు. మానుకోటలో ఎంతోమంది తనకు అభిమానులు ఉండటం సంతోషించదగ్గ విషయమని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతేకాదు మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా ఉండేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి సిలిండర్లను పంపించారని తెలిపారు శంకర్ నాయక్.

Chiranjeevi,Chiranjeevi twitter,Chiranjeevi instagram,Chiranjeevi oxygen cylinders,Chiranjeevi covid help,Chiranjeevi call to MLA shankar naik,telugu cinema,చిరంజీవి,ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన చిరంజీవి,శంకర్ నాయక్‌తో చిరంజీవి ఫోన్ పలకరింపు
MLA శంకర్ నాయక్‌కు చిరంజీవి ఫోన్ (Chiranjeevi Shankar Naik)

ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన చిరంజీవి.. హలో శంకర్ ఎలా ఉన్నారు.. కుటుంబ సభ్యులు అంతా బాగున్నారా.. ప్రజల్లో బాగా తిరుగుతారు.. పరిస్థితులు అసలే బాగాలేవు.. ప్రజలకు బాగా ఉపయోగపడే వ్యక్తి మీరు.. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటూ మాట్లాడారు. తాము కోరిన వెంటనే జిల్లాకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి సిలిండర్లు అందించినందుకు చిరంజీవికి టిఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Chiranjeevi, MLA Shankar Naik, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు