news18-telugu
Updated: December 2, 2020, 5:16 PM IST
చిరంజీవి (Twitter/Photo)
Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు చిరంజీవి. అప్పటికే ఎంతో మంది హీరోలున్న తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకొని మెగాస్టార్‌గా ఎదిగారు. ఇక చిరంజీవిని అభిమానులందరు చిరు అని ముద్దుగా సంభోదిస్తుంటారు. ఇంతకీ ఈ ముద్దు పేరును ఇండస్ట్రీలో ఎవరు పెట్టారంటే.. రీసెంట్గా ఆలీతో సరదగా కార్యక్రమంలో అపుడెపుడో కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సప్తపది’ చిత్రంలో హీరోగా నటించిన రవికాంత్‌తో పాటు అందులో హీరోయిన్గా నటించిన సబితా భమిడిపాటి ఈ ఇంటర్వ్యూలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా రవికాంత్ ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈయన సప్తపది చిత్రం తర్వాత చిరంజీవితో కలిసి ‘మంచు పల్లకి’ చిత్రంలో నటించారు. ఈ షూటింగ్ సమయంలోనే చిరంజీవిని పూర్తి పేరుతో కాకుండా.. చిరు అని పిలిచేవారట. ఓసారి బీరు తాగుతూ.. బీరు.. చిరు అని అన్నాడట. అంతకు ముందు చిరంజీవిని ఎవరు చిరు అని సంభోదించలేదట. రవికాంత్ ఎపుడైతే.. చిరంజీవిని ముద్దుగా చిరు అని పిలిచారో.. అప్పటి నుంచి యూనిట్ మెంబర్స్ కూడా చిరంజీవిని చిరు అని పిలవడం ప్రారంభించారు. ఈ రకంగా చిరంజీవి .. ముద్దు పేరు చిరు ఇండస్ట్రీలోఅలా పాపులర్ అయిపోయింది.
ప్రస్తుతం చిరంజీవి.. తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌లో యాక్ట చేస్తున్నాడు. దాంతో పాటు లూసీఫర్’ రీమేక్‌ను మోహన్ రాజా దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 2, 2020, 5:16 PM IST