హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi: చిరంజీవి దాతృత్వం.. కర్ణాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం!

Chiranjeevi: చిరంజీవి దాతృత్వం.. కర్ణాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం!

చిరంజీవి (Chiranjeevi Photo : Twitter)

చిరంజీవి (Chiranjeevi Photo : Twitter)

Chiranjeevi: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో..ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు అందక ఎంతో మంది మరణిస్తున్నారు.

  Chiranjeevi: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో..ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు అందక ఎంతో మంది మరణిస్తున్నారు. అంతేకాకుండా ఆక్సిజన్ కొరత ఏర్పడటంవల్ల ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది రోగులకు ఆక్సిజన్ కొరత ఏర్పడగా.. కొంత మంది సెలబ్రెటీలు తమ వంతు సహాయంతో ఆక్సిజన్ బ్యాంక్ ను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆక్సిజన్ బ్యాంక్ ను ప్రారంభించారు.

  టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎంతో పెద్ద మనసుతో ఎంతోమందికి తనవంతు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఎంతోమందికి ఆర్థికపరంగా ఆదుకున్నాడు. ఇక ప్రస్తుతం కోవిడ్ సమయంలో కూడా తన వంతు సహాయం చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ లు ఏర్పాటు చేస్తామని తెలిపాడు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులను అందుబాటులోకి తీసుకువస్తానని తెలిపిన మెగాస్టార్ మొత్తానికి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభించాడు.

  ఈరోజు ఉదయం కర్ణాటకలో మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ను ప్రారంభించాడు. కర్ణాటక - చింతామణిలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభమయ్యింది. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి శ్రీ మహేష్( చింతామణి)కి స్వయంగా అభినందనలు తెలిపారు. ఇక ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంక్ గురించి సోనూసూద్ కూడా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా ఇటీవలే టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ కూడా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. మొత్తానికి ఆక్సిజన్ బ్యాంక్ ఆలోచన వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలుస్తున్నాయి.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Corona virus, Covid-19, Karnataka, Megastar Chiranjeevi, Oxygen bank, Ram Charan, Tollywood, కరోనా సెకండ్ వేవ్, మెగాస్టార్ చిరంజీవి

  ఉత్తమ కథలు