MegaStar Chiranjeevi: సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్‌లో చిరంజీవి మరో రికార్డు..

చిరంజీవి ఆచార్య (Chiranjeevi Acharya)

Megastar Chiranjeevi  | మెగాస్టార్ చిరంజీవి ఎపుడైతే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారో  అప్పటి నుంచి ఏదో ఒక వార్తతో  కానీ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. తనకు ఫ్యాన్స్ మధ్య ఉన్న అడ్డుగోడకు చెరిపేసారు. తాజాగా చిరంజీవి ట్విట్టర్‌లో మరో రికార్డు క్రియేట్ చేసారు.

  • Share this:
    Megastar Chiranjeevi  | మెగాస్టార్ చిరంజీవి ఎపుడైతే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారో  అప్పటి నుంచి ఏదో ఒక వార్తతో  కానీ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. తనకు ఫ్యాన్స్ మధ్య ఉన్న అడ్డుగోడకు చెరిపేసారు. అంతేకాదు ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు కరోనాతో బాధపడుతున్న ప్రజలకు తనదైన సలహాలు, సూచనలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరోవైపు తన సహచర నటీనటుల పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ సోసల్ మీడియా వేదికైన ట్విట్టర్‌లో చిరును ఫాలో అయ్యే వారు 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ఉన్నారు. ఈయన గతేడాది మార్చి 25న ఉగాది సందర్భంగా ట్విట్టర్‌లో అడుగుపెట్టారు. అదే రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు.

    ఇక మెగాస్టార్ చిరంజీవికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.  ఇక ఈయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినీ ఫాలో కావడం లేదు. మరోవైపు ట్విట్టర్‌లో కూడా ఈయన ఎవరినీ ఫాలో కావడం లేదు. . ఈయన ట్విట్టర్‌లో తన తనయుడు రామ్ చరణ్ ఒక్కరినే ఫాలో అయ్యేవారు. ఇపుడు అది కూడా లేదు.  మొత్తంగా సోషల్ మీడియాలో ప్రవేశించిన యేడాది తర్వాత  1 మిలియన్  ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు.  ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారి రామ్ చరణ్‌తో ఫుల్ లెంగ్త్ పాత్రలో కలిసి నటించారు.  ఆ తర్వాత చిరంజీవి.. మోహన్ రాజా  దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్‌తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాలం’ రీమేక్‌లో నటించడానికీ రెడీ అవుతున్నారు. మరోవైపు బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘ఎన్నై ఎరిందాల్’ సినిమా రీమేక్‌లో నటించబోతున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: