Chiranjeevi leaks: దేవుడా.. చిరంజీవి మళ్లీ నోరు జారాడుగా.. కంగారులో ‘ఉప్పెన’ టీమ్..

ఉప్పెన టీమ్‌తో చిరంజీవి (Chiranjeevi)

Chiranjeevi: చిరంజీవికి మైక్ ఇవ్వాలంటే భయపడుతున్నారు దర్శక నిర్మాతలు. అదే విషయం ఆయన కూడా చెప్పాడు. తనపై తానే సెటైర్లు వేసుకుంటూ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు చిరంజీవి. తనకు మైక్ ఇస్తే ఎక్కడ అసలు విషయాలన్నీ లీక్ చేస్తానో..

  • Share this:
చిరంజీవికి మైక్ ఇవ్వాలంటే భయపడుతున్నారు దర్శక నిర్మాతలు. అదే విషయం ఆయన కూడా చెప్పాడు. తనపై తానే సెటైర్లు వేసుకుంటూ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు చిరంజీవి. తనకు మైక్ ఇస్తే ఎక్కడ అసలు విషయాలన్నీ లీక్ చేస్తానో అని దర్శకులు కూడా భయపడుతున్నారని చెప్పాడు మెగాస్టార్. ఇప్పుడు ఉప్పెన విషయంలో కూడా ఇదే జరిగింది. ఏదో ఒక్క‌సారి చేస్తే పొరపాటు.. మ‌రోసారి చేస్తే గ్ర‌హ‌పాటు.. కానీ ప్ర‌తీసారి చేస్తూ పోతే అది అల‌వాటు. ఇప్పుడు చిరంజీవికి మూడోది వ‌చ్చింది. త‌నప‌ర బేధం లేకుండా అన్నిచోట్లా నోరు జారుతున్నాడు మెగాస్టార్. ఇదే ఇప్పుడు అక్క‌డున్న వాళ్ల‌తో పాటు సినిమా యూనిట్‌కు కూడా లేనిపోని ఇబ్బందులు తీసుకొస్తుంది. ఇప్పుడు కూడా ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన చిరు.. ఆ సినిమా గురించి ఏం చెప్పనంటూనే క్లైమాక్స్ గురించి చెప్పేసాడు. ముందు నుంచి కూడా ఉప్పెన క్లైమాక్స్ గురించి చాలా చర్చ జరుగుతుంది. ఇది విషాదాంత ప్రేమకథ అంటూ చాలా మంది చెప్తున్నారు. నిజానికి క్లైమాక్స్‌లో హీరో హీరోయిన్లను చంపేస్తారా లేదా అనేది పక్కనబెడితే ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చూడనటువంటి ఓ రేర్ క్లైమాక్స్ మాత్రం ఇందులో చూపించబోతున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. అదేంటో ఇప్పుడే చెప్పడం కష్టం కానీ అది చూసిన తర్వాత మాత్రం కచ్చితంగా అంతా ఒక్కసారిగా షాక్‌లోకి అయితే వెళ్లిపోతారు.

chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi uppena climax leaks,chiranjeevi leak uppena climax,chiranjeevi movies,chiranjeevi acharya movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి ఉప్పెన క్లైమాక్స్,చిరంజీవి సినిమాలు,చిరంజీవి లీక్స్
ఉప్పెన టీమ్‌తో చిరంజీవి (Chiranjeevi)

అలాంటి ముగింపు ఉప్పెన కోసం రాసుకున్నాడు బుచ్చిబాబు. ఇదిలా ఉంటే సినిమా చూసిన తర్వాత చిరంజీవి కూడా ఇదే ఫీల్ అయ్యాడు. అందుకే ఏం చెప్పను అంటూనే క్లైమాక్స్‌లో వచ్చే సీన్ గురించి ఓపెన్ అయిపోయాడు. అలాంటి ముగింపు ఊహించడం కష్టమే అని.. ఆ తర్వాత హీరోయిన్ తండ్రితో మాట్లాడే సీన్ కూడా బాగుంటుందని చెప్పేసాడు చిరు. అంటే క్లైమాక్స్‌లో హీరోయిన్‌తో విజయ్ సేతుపతి చేసే సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని ముందుగానే లీక్ చేసాడు చిరు.

chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi uppena climax leaks,chiranjeevi leak uppena climax,chiranjeevi movies,chiranjeevi acharya movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి ఉప్పెన క్లైమాక్స్,చిరంజీవి సినిమాలు,చిరంజీవి లీక్స్
’ఆచార్య’లో చిరంజీవి (Twitter/Photo)

దాంతో అక్కడున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. కథలో ఇలాంటి ట్విస్టులు దాచేయాలని టీం కోరుకుంటుంటే.. చిరు మాత్రం తనకు తెలియకుండానే చెప్పనంటూనే చెప్పేసాడు. ఆ మధ్య ఆచార్య టైటిల్ విషయంలోనూ ఇదే చేసాడు చిరు. ఓ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆచార్య అంటూ నోరు జారాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య.. అంటూ నాలిక కరుచుకున్నాడు మెగాస్టార్. ఆ తర్వాత టైటిల్ చెప్పేసానా అంటూ పక్కనే ఉన్న బ్రహ్మాజీ వైపు చూశాడు.

chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi uppena climax leaks,chiranjeevi leak uppena climax,chiranjeevi movies,chiranjeevi acharya movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి ఉప్పెన క్లైమాక్స్,చిరంజీవి సినిమాలు,చిరంజీవి లీక్స్
చిరంజీవి (Chiranjeevi) Photo : Twitter

ఈ సినిమా టైటిల్ కోసం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం పెట్టి అందులో అనౌన్స్ చేద్దాం అనుకుంటే చిరంజీవి మాత్రం నోరు జారాడు. ఆ తర్వాత కొరటాల శివకు సారీ చెప్పాడు. అయితే ఎంత సారీ చెప్పిన కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చిరంజీవి ఇలా నోరు జారడం ఇదే మొదటిసారి కాదు. అప్పట్లో గీత‌ గోవిందం స‌క్సెస్ మీట్ కు వ‌చ్చిన మెగాస్టార్.. సినిమా విడుద‌లైన ఐదు రోజులకే కథ మొత్తం చెప్పేసాడు. సినిమాను మ‌లుపు తిప్పే స‌న్నివేశం గురించి కూడా అలా చెప్పేస్తే పాపం అక్క‌డే ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ బిత్త‌ర‌పోయి చూసాడు.

chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi uppena climax leaks,chiranjeevi leak uppena climax,chiranjeevi movies,chiranjeevi acharya movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి ఉప్పెన క్లైమాక్స్,చిరంజీవి సినిమాలు,చిరంజీవి లీక్స్
చిరంజీవి (Chiranjeevi)

చేసేదేం లేక అల్లు అర‌వింద్ వైపు చూస్తే.. ఆయ‌నేదో స‌ర్ది చెప్పాడు. గ‌తంలో రంగ‌స్థ‌లం ఆడియో వేడుక‌లో కూడా రిలీజ్ కు ముందే క్లైమాక్స్ లో ఆది చ‌చ్చిపోతాడ‌ని చెప్పేసాడు చిరంజీవి. ఆయ‌న తెలిసి తెలియ‌క చేస్తోన్న చిన్న పొర‌పాట్లు సినిమాల‌పై ప్ర‌భావం చూపించక‌పోతే చాలు..! ఎందుకంటే ఆయ‌నంటే ఉన్న గౌర‌వంతో క‌నీసం ఒక్క‌రు కూడా క‌న్నెత్తి చూడ‌రు.. ప‌న్నెత్తి మాట్లాడరు. ఈ విష‌యం చిరు కూడా కాస్త అర్థం చేసుకోవాలి మ‌రి..! ఇప్పుడు తన సినిమా టైటిల్ గురించి కూడా ఇలాగే నోరుజారి దర్శక నిర్మాతలకు షాక్ ఇచ్చాడు.
Published by:Praveen Kumar Vadla
First published: