అదేంటి.. పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నాను.. ఇకపై అటు వెళ్లనని చెప్పాడు కదా చిరంజీవి.. మళ్లీ అక్కడికి వెళ్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా..? నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు మరోసారి రాజకీయాల వైపు అయితే వెళ్తున్నాడు మెగాస్టార్. కాకపోతే రియల్ లైఫ్ పాలిటిక్స్ మాత్రం చేయడం లేదు. రీల్ లైఫ్లో ఈయన మరోసారి పొలిటికల్ వైపు అడుగులేస్తున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో నక్సలైట్ పాత్రలో ఈయన నటిస్తున్నాడని ప్రచారం జరుగుతూ వచ్చింది. అలాగే ఈ చిత్రం మొదలైన దగ్గర నుంచి కూడా స్టోరీ లైన్ గురించి చాలా వార్తలే వస్తూ ఉన్నాయి.

చిరంజీవి కొరటాల సినిమా లుక్ లీక్ (chiranjeevi new movie title acharya)
ఇప్పుడు వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ తన సినిమా కథపై క్లారిటీ ఇచ్చాడు కొరటాల శివ. నక్సలైట్ అని ఓ సారి.. పురాతన దేవాలయ సంపదను కాపాడడానికి పోరాడే ప్రొఫెసర్ అని మరోసారి కథలు వినిపించాయి. అయితే ఇది పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్ అని చెబుతున్నాడు ఈ దర్శకుడు. ఆచార్య ఓ పొలిటికల్ థ్రిల్లర్.. అందులో ప్రకృతి వనరులను కాపాడే ఓ వ్యక్తిగా చిరంజీవి పాత్ర ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు కొరటాల శివ. దాంతో అనుమానాలు ఒక్కసారిగా క్లియర్ అయిపోయాయి.

చిరంజీవి కొరటాల సినిమా (chiranjeevi new movie title acharya)
ప్రకృతి ప్రేమికుడు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జూనియర్ ఎన్టీఆర్. గతంలో ఇదే కొరటాల శివ తెరకెక్కించిన జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కారెక్టర్ అదే. ప్రకృతి వనరులను కాపాడే వ్యక్తిగా ఆయన నటించాడు. ఇఫ్పుడు చిరంజీవి కూడా ఇదే పాత్రలో నటిస్తున్నాడు. ఆచార్యలో రామ్ చరణ్ కూడా ఉన్నాడని చిరంజీవితో పాటు కొరటాల కూడా కన్ఫర్మ్ చేసాడు.

జూనియర్ ఎన్టీఆర్ (Twitter/Jr NTR)
ఆయనకు కూడా హీరోయిన్ ఉంటుందని తెలిపాడు ఈ దర్శకుడు. మొత్తానికి చిరంజీవి ఆచార్య సినిమా గురించి చాలా ముచ్చట్లే బయటికి చెప్పాడు ఈయన. దాంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. షూటింగ్ ఇప్పటి వరకు 40 శాతం పూర్తయిందని.. దీనికోసం ఫారెన్ కంట్రీస్ అవసరం లేదని.. మిగిలిన 60 శాతం షూటింగ్ కూడా కేవలం ఇన్డోర్లోనే షూట్ చేస్తామని చెప్పాడు కొరటాల. విడుదల మాత్రం ఎప్పుడో తెలియదని చెప్పాడు ఈ దర్శకుడు.
Published by:Praveen Kumar Vadla
First published:April 15, 2020, 19:59 IST