చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీ ఎంట్రీ తర్వాత ఆయనలో కొత్త జోష్ వచ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావడంతో ఇంకా జోరు పెంచేసాడు ఈ హీరో. ఇప్పుడు వరస చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ప్రస్తుతం ‘సైరా’ సినిమా షూటింగ్‌తో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు ఈ హీరో. ‘సైరా’ అలా పూర్తవుతుందో లేదో వరసగా మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కూడా ఈయన కోసం చూస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాలు కూడా కన్ఫర్మ్ చేసాడు చిరంజీవి.
కొరటాల శివతో తర్వాతి సినిమా ఉండబోతుందని ఇప్పటికే చిరు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత రామ్ చరణ్ కూడా కన్ఫర్మ్ చేసాడు. త్రివిక్రమ్ సీన్లోకి రావడంతో ఎవరి సినిమా ముందు ఉంటుందో అనే టెన్షన్ అభిమానుల్లో కూడా కనిపించింది. కానీ ఇప్పుడు దీనిపై కూడా క్లారిటీ ఇచ్చాడు చరణ్. ముందు చిరు ఎవరి సినిమా చేయబోతున్నాడో చెప్పాడు మెగా వారసుడు. రేస్‌లో కొరటాల శివే ముందున్నాడు అని క్లారిటీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్. ఈ చిత్రాన్ని కొణిదెల బ్యానర్‌తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కూడా సంయుక్తంగా నిర్మించనుంది.
ఇదే ఏడాది సమ్మర్లో కొరటాల శివ-చిరంజీవి సినిమా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉండబోతుంది. దీన్ని డివివి దానయ్య నిర్మిస్తాడు. బోయపాటి శ్రీను కూడా లైన్లోనే ఉన్నాడు. 154వ సినిమా ఈయనతో చేసే ఛాన్స్ ఉంది. అల్లు అరవింద్, అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చిరంజీవి 150 తర్వాత కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.. అస్సలు బ్రేకులు లేకుండా దూసుకుపోతున్నాడు.
దిశాపటానీ హాట్ ఫోటోషూట్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boyapati Srinu, Chiranjeevi, Ram Charan, Telugu Cinema, Tollywood, Trivikram